
దావోస్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య రౌడ్ టేబుల్ మీటింగ్ జరిగింది. ఈ చర్చల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. రాష్టాల అభివృద్ధి, టెక్నాలజీ ప్రగతి, దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లపై వారు ప్రధానంగా చర్చించారు. అలాగే దేశం, రాష్ట్రాల అభివృద్ధి దృష్టికోణం, సంక్షేమం, ఆర్థిక వ్యవస్థ, ఇన్నోవేషన్, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డిస్రప్షన్, స్థిరత్వం, ఉద్యోగ కల్పన, భవిష్యత్తు దిశలపై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రౌండ్ టేబుల్ మీటింగ్‌లో చర్చించినట్లు అధికారులు తెలిపారు.
అత్యధిక పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంతో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్‌లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు ఏపీ, తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించాయి. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలతో ఆ కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సైతం తమ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు దావోస్‌లో శాయశక్తులా కృషిచేస్తున్నారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో టీమిండియా అంటూ ఎక్స్‌లో ఫొటో షేర్ చేసిన సీఎం చంద్రబాబు నాయుడు
Team India At @wef!🇮🇳@Dev_Fadnavis @revanth_anumula pic.twitter.com/b6i1ngCdRe
— N Chandrababu Naidu (@ncbn) January 22, 2025