Health Problem: ఈమె రోజుకు 70 సార్లు వాంతులు చేసుకుంటుంది.. మ్యాటర్ తెలిస్తే మీటర్ ఎగిరిపోవాల్సిందే..

|

Nov 22, 2021 | 6:21 AM

Health Problem: ఎవరికైనా ఒక రోజులో నాలుగైదు సార్లు వాంతులు అయితే ఏం చేస్తారు? వెంటనే వైద్యుడిని సంప్రదించమని వారికి సలహా ఇస్తారు. కానీ ఇక్కడ ఒక మహిళకు రోజుకు 70 వాంతులు అవుతాయట.

Health Problem: ఈమె రోజుకు 70 సార్లు వాంతులు చేసుకుంటుంది.. మ్యాటర్ తెలిస్తే మీటర్ ఎగిరిపోవాల్సిందే..
Desease
Follow us on

Health Problem: ఎవరికైనా ఒక రోజులో నాలుగైదు సార్లు వాంతులు అయితే ఏం చేస్తారు? వెంటనే వైద్యుడిని సంప్రదించమని వారికి సలహా ఇస్తారు. కానీ ఇక్కడ ఒక మహిళకు రోజుకు 70 సార్లు వాంతులు అవుతాయట. అవునండి బాబు.. ఇది నిజంగా నిజం. సాధారణంగా అయితే నిరంతరాయంగా ఒక ఏడు ఎనిమిది సార్లు వాంతులు అయితేనే మంచం మీద నుంచి లేవడం కష్టం. అలాంటిది రోజుకు 70 సార్లు అంటే మనిషి జీవించగలడా? ఆలోచిస్తేనే అమ్మో అనిపిస్తుంది కదా. అయితే, ఓ వింత వ్యాధి కారణంగా బాధిత మహిళ ఇలా రోజుకు 70 సార్లు వాంతులు చేసుకుంటుందట. మరి వ్యాధి ఏంటి, ఆ మహిళ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంగ్లండ్‌లోని బోల్టన్‌కు చెందిన లిన్నే విలియన్ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ వ్యాధి కారణంగా, లీన్ రోజుకు 70 సార్లు వాంతులు చేసుకుంటుంది. వినడానికి చాలా వింతగా అనిపించినా లీన్ జీవితం ఇలాగే సాగుతోంది మరి. ఆమెకు అది అలవాటు అయిపోయింది.

లీన్ అరుదైన గ్యాస్ట్రోపరేసిస్ వ్యాధితో బాధపడుతున్నారట. మొత్తం బ్రిటన్‌లో ఈ వ్యాధి కేవలం 6 శాతం మందికి మాత్రమే ఉందని వైద్యులు చెబుతున్నారు. కడుపులోనూ పక్షవాతం వస్తుందట.. దాని ఫలితంగానే లీన్ రోజుకు 70 సార్లు వాంతులు చేసుకుంటుందని వైద్యులు తెలిపారు. అయితే, 39 ఏళ్ల లిన్ విలియన్‌కు 2008లో ఈ వ్యాధి ఉన్నట్లు గుర్తించారు. నేడు ఆమె వీల్ చైర్ పైనే జీవితం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యాధి కారణంగా ఆమె తన ఆత్మీయులందరికీ దూరమైంది. రోజంతా వాంతులు చేసుకోవడంతో ఆమె ఎవరి ఇంటికి వెళ్లలేక, ఏ ఫంక్షన్‌కు వెళ్లలేకపోతోంది.

అయితే, వైద్యులు గ్యాస్ట్రిక్ పేస్‌మేకర్ ద్వారా లీన్‌కు ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నించారు. ఈ పేస్‌మేకర్‌ ద్వారా వారి పొట్టను సాధారణ మనిషిలా నియంత్రించవచ్చట. అయితే, ఇప్పుడు దాని బ్యాటరీ అయిపోయిందట. దాంతో లీన్ సమస్య మునుపటి కంటే ఎక్కువగా పెరిగిందట. కొత్త బ్యాటరీ కావాలంటే రూ. 10 లక్షలు ఖర్చు అవుతుందట. అనారోగ్యం కారణంగా లీన్ తన ఉద్యోగం కూడా కోల్పోయింది. ఇప్పుడు ఆమె తన బ్యాటరీ కోసం క్రౌడ్ ఫండింగ్ చేస్తోంది.

Also read:

Viral Video: ఫోన్‌ వాడటం మొదలెడితే.. మాకన్న ఎవరూ వాడలేరంటున్న కోతులు.. ఫన్నీ వీడియో

Beware: ఫ్రీజ్‌లో ఆ 8 ఆహార పదార్థాలను ఎప్పుడూ ఉంచవద్దు.. ఎందుకో తెలిస్తే షాకే..

AP Rains: ప్రయాణికులకు అలెర్ట్‌.. భారీ వర్షాల కారణంగా 18 రైళ్లు రద్దు.. పలు సర్వీసులు దారి మళ్లింపు..