Viral Video: లైవ్ జరుగుతుండగా నిరసన.. మహిళా జర్నలిస్ట్ కు 15 ఏళ్ల జైలుశిక్ష.. కారణమేంటంటే

రష్యా - ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఆగాలంటూ ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అయితే యుద్ధం (War) ఆపాలంటూ రష్యా టీవీ లైవ్‌ షోలో ఓ మహిళా జర్నలిస్ట్ నిరసన తెలిపారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అధికార యంత్రాంగం...

Viral Video: లైవ్ జరుగుతుండగా నిరసన.. మహిళా జర్నలిస్ట్ కు 15 ఏళ్ల జైలుశిక్ష.. కారణమేంటంటే
Woman Journalsit Russia

Updated on: Mar 16, 2022 | 5:48 PM

Russia Ukraine War News: రష్యా – ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఆగాలంటూ ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అయితే యుద్ధం (War) ఆపాలంటూ రష్యా టీవీ లైవ్‌ షోలో ఓ మహిళా జర్నలిస్ట్ నిరసన తెలిపారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అధికార యంత్రాంగం ఆమెకు దాదాపు 15 ఏళ్లు జైలు శిక్ష విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మాస్కోలోని ఓ ఛానల్‌లో పనిచేస్తున్న మెరీనా ఓవ్స్యానికోవా.. యుద్ధం ఆపాలని ప్లకార్డుతో రష్యా (Russia) కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి తాను చేసిన ప్రయత్నాలను మహిళా జర్నలిస్ట్ (Journalist) వెల్లడించారు. తనను 14 గంటలపాటు పోలీసులు విచారించినట్లు తెలిపారు.

తన కుటుంబాన్నీ కలిసేందుకు అనుమతి ఇవ్వలేదని, ‌అంతేగాక ఘటన తర్వాత పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు న్యాయ సహాయం కూడా అందలేదని వాపోయారు. రష్యా మహిళా జర్నలిస్ట్ నిరసన విషయం తెలిపిన యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

అయితే రష్యాలోని ఓ వార్తా ఛానెల్​లో జర్నలిస్ట్​లైవ్​లోనే యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన విషయం తెలిసిందే. మరో జర్నలిస్ట్‌ వార్తలు చదువుతుండగా యుద్ధానికి వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకుని నిరసనను తెలిపింది. ‘యుద్ధం వద్దు.. యుద్ధాన్ని ఆపండి.. వాళ్లు ఇక్కడ అబద్దం చెబుతున్నారు. తప్పుడు ప్రచారాలను అసలు ఎవరూ నమ్మోద్దు’ అని నిరసన వ్యక్తం చేసింది.

ఇవీచదవండి

IPL 2022, Suresh Raina: సురేశ్ రైనా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్ 2022లో రీఎంట్రీ..

Kapil Sibal Vs Congress Leaders: కాంగ్రెస్‌లో మళ్లీ మొదలైన ఇంటిపోరు.. కపిల్ సిబల్‌పై పార్టీ సీనియర్స్ మండిపాటు

Telangana Tenth Exams: తెలంగాణలో మే 23 నుంచి పదో తరగతి పరీక్షలు.. కొత్త షెడ్యూల్ విడుదల..