Bird flu: అరుదైన బర్డ్ ఫ్లూతో యువతి మృతి.. కరోనా పుట్టినింట ఆందోళకరంగా పెరుగుతున్న కేసులు..

|

Dec 29, 2023 | 5:43 PM

బర్డ్ ఫ్లూ కారణంగా మహిళ మృతి చెందిందన్న వార్తతో సర్వత్ర ఆందోళన మొదలైంది. మనుషుల్లోనూ బర్డ్ ఫ్లూ తీవ్రత మరణాలకు దారితీస్తున్న కారణం అక్కడ ఆందోళనగా మారింది. H5N6 అనేది 39 శాతం మరణాల రేటు కలిగిన వైరస్ రకంగా చెబుతున్నారు నిపుణులు. అయితే, ఇది మనుషుల్లో వ్యాపించటం అంత సాధారణం కాదంటున్నారు. గత 10 ఏళ్లలో 88 H5A6 కేసులు నమోదయ్యాయి. వీటిలో 87 కేసులు ప్రధాన భూభాగంలో ఉన్నాయి.

Bird flu: అరుదైన బర్డ్ ఫ్లూతో యువతి మృతి.. కరోనా పుట్టినింట ఆందోళకరంగా పెరుగుతున్న కేసులు..
Bird Flu
Follow us on

కరోనా వైరస్‌ తర్వాత బర్డ్ ఫ్లూ అంటే ప్రజల్లో భయం వెంటాడుతుంది. కానీ బర్డ్ ఫ్లూ మనుషువులకు సోకడం, మరణాలు వంటివి నమోదు కాకపోవటం ప్రజలకు ఊరట కలిగించే విషయం. కానీ ఇప్పుడు చైనాలోని కొన్ని ప్రాంతాల్లో, బర్డ్ ఫ్లూ మనుషుల్లోనూ మరణాలకు దారి తీస్తుంది. అక్కడ బర్డ్‌ఫ్లూ తీవ్రత చాలా ఆందోళన కలిగిస్తుంది. ఇప్పుడు 33 ఏళ్ల మహిళ అరుదైన బర్డ్ ఫ్లూ బారిన పడి మృతి చెందినట్లు చైనా నుంచి వార్తలు వస్తున్నాయి. యువతికి హెచ్5ఎన్6 సోకిందని సమాచారం. చికిత్స పొందుతూ బాధిత మహిళ మృతి చెందినట్టుగా తెలిసింది. మృతిచెందిన మహిళతో పాటుగా మరికొందరు చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లోని బసోబ్‌లో ఉన్న కోళ్ల ఫారమ్‌కు వెళ్లారు. ఇక్కడి నుంచే వీరికి బర్డ్ ఫ్లూ వచ్చిందని భావిస్తున్నారు. తర్వాత యువతిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. కానీ ఇరవై రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్టుగా తెలిసింది.

చైనాలో బర్డ్ ఫ్లూ కారణంగా మహిళ మృతి చెందిందన్న వార్తతో సర్వత్ర ఆందోళన మొదలైంది. మనుషుల్లోనూ బర్డ్ ఫ్లూ తీవ్రత మరణాలకు దారితీస్తున్న కారణం అక్కడ ఆందోళనగా మారింది. H5N6 అనేది 39 శాతం మరణాల రేటు కలిగిన వైరస్ రకంగా చెబుతున్నారు నిపుణులు. అయితే, ఇది మనుషుల్లో వ్యాపించటం అంత సాధారణం కాదంటున్నారు. గత 10 ఏళ్లలో 88 H5A6 కేసులు నమోదయ్యాయి. వీటిలో 87 కేసులు చైనా ప్రధాన భూభాగంలో ఉన్నాయి. అందుకోసం ఇక్కడ వైద్యారోగ్యశాఖ గణనీయ నివారణ చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.

కోవిడ్-19 మహమ్మారికి చైనా కేంద్రంగా అందరికీ తెలిసిందే. ఇది తరువాత ప్రపంచమంతటా వ్యాపించింది. ఈ భయం నేపథ్యంలో చైనాలో ఇప్పుడు బర్డ్ ఫ్లూ వ్యాప్తి సైతం ఆందోళనకరంగా మారింది. ఈ వార్త వెలువడిన వెంటనే ఇతర దేశాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..