కరోనా సోకిన వ్యక్తితో పావుగంట పాటు ఉంటే..

|

Aug 28, 2020 | 3:00 PM

ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ కరోనా పరీక్షలు నిర్వహించాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ఎవరికి కరోనా పరీక్షలు నిర్వహించాలన్న అంశంపై ప్రపంచ దేశాలు తమ మార్గదర్శకాలు పాటించవచ్చని పేర్కొంది.

కరోనా సోకిన వ్యక్తితో పావుగంట పాటు ఉంటే..
Follow us on

ఎలాంటి లక్షణాలు లేనప్పటికీ కరోనా పరీక్షలు నిర్వహించాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. ఎవరికి కరోనా పరీక్షలు నిర్వహించాలన్న అంశంపై ప్రపంచ దేశాలు తమ మార్గదర్శకాలు పాటించవచ్చని పేర్కొంది. వైరస్ సోకినట్టు నిర్ధారణ అయిన వ్యక్తికి 6 అడుగుల దూరంలో పావుగంట పాటు గడిపిన అందరికీ పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. ఇద్దరు వ్యక్తుల మధ్య కనీసం ఒక మీటర్ దూరం పాటించాల్సిందేనంది. ఆరు నుంచి పదకొండేళ్ల మధ్య చిన్నారులు మాస్క్ కచ్చితంగా ధరించాలని సూచించింది. కరోనా లక్షణాలు లేకుంటే పరీక్షలు అవసరం లేదన్న కొన్ని దేశాల నిర్ణయాల్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తీవ్రంగా తప్పుబట్టింది. కొవిడ్ కట్టడిలో భాగంగా చేపడుతోన్న పరీక్షల్ని మరింత ఎక్కువగా చేయడమే ఈ వ్యాధి వ్యాప్తిని అడ్డుకునేందుకు ఉన్న ఏకైక మార్గమని పునరుద్ఘాటించింది.