Aspartame: ‘కూల్ డ్రింక్స్‌లో వాడే కృత్రిమ తీపితో క్యాన్సర్‌ ముప్పు’.. స్పష్టం చేసిన WHO

|

Jul 14, 2023 | 1:36 PM

శీతల పానీయాల్లో వినియోగించే అస్పర్టమే అనే కృత్రిమ స్వీటెనర్‌ వల్ల క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గురువారం (జులై 13) ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా పలు వ్యాపార సంస్థలు కూల్‌ డ్రింక్స్‌, తక్కువ చక్కెర కలిగిన..

Aspartame: కూల్ డ్రింక్స్‌లో వాడే కృత్రిమ తీపితో క్యాన్సర్‌ ముప్పు.. స్పష్టం చేసిన WHO
Soft Drinks
Follow us on

జెనీవా, జులై 14: శీతల పానీయాల్లో వినియోగించే అస్పర్టమే అనే కృత్రిమ స్వీటెనర్‌ వల్ల క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గురువారం (జులై 13) ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా పలు వ్యాపార సంస్థలు కూల్‌ డ్రింక్స్‌, తక్కువ చక్కెర కలిగిన ఆహారాల్లో ‘అస్పర్టమే’ విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. ఈ కృత్రిమ స్వీటెనర్ వినియోగం వల్ల క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం అధికారికంగా ప్రకటించింది.

ఐతే కాఫీ, టీలలో వినియోగించే అస్పర్టమే ట్యాబ్లెట్స్‌ అంత ప్రమాదకారి కాదని స్పష్టం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకరంగా స్థూలకాయం అత్యధికంగా పెరుగడంపై ఇటీవల పరిశోధనలు జరిగాయి. పానీయాల్లో వినియోగించే అస్పర్టమే కృత్రిమ తీపి ‘హెపాటోసెల్లర్ కార్సినోమా’ అని పిలవబడే కాలేయ క్యాన్సర్‌కు కారణం అవుతుందని అధ్యయనాల్లో బయటపడింది. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ క్యాన్సర్‌ (IARC), డబ్ల్యూహెచ్‌ఓ (WHO), ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO), జాయింట్ ఎక్స్‌పర్ట్ కమిటీ ఆన్ ఫుడ్ అడిటివ్స్ (JECFA).. ఉమ్మడిగా ఇందుకు సంబంధించిన వివరణాత్మక అధ్యయన నివేదికను విడుదల చేశాయి.

అస్పర్టమే అంటే..

ఇవి కూడా చదవండి

అస్పర్టమే అనేది అస్పార్టిక్ యాసిడ్, ఫెనిలాలనైన్ అనే రెండు అమైనో ఆమ్లాలతో తయారు చేసిన కృత్రిమ తీపి. దీనిని 1980 నుంచి డైట్ డ్రింక్స్, చూయింగ్ గమ్, జెలటిన్, ఐస్ క్రీం, పాలు-పెరుగు ఉత్పత్తులు, టూత్‌పేస్ట్, దగ్గు సిరప్‌, చూయింగ్‌ గమ్‌ వంటి పలు ఆహారాలు, శీతల పానీయాల ఉత్పత్తుల్లో కృత్రిమ (రసాయన) స్వీటెనర్ ఉపయోగిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాల్లో క్యాన్సర్ కూడా ఒక ప్రధాన కారకం. ప్రతి 6 మందిలో ఒకరు క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. క్యాన్సర్ వ్యాధిని నిరోధించే కారకాలపై ఎప్పటి నుంచో పరిశోధనలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా పానియాల్లో వినియోగించే అస్పర్టమే క్యాన్సర్ సంభావ్యత కలిగి ఉన్నట్లు బయటపడింది. ఐతే పరిమిత మోతాదు వరకు దీని వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని తెల్పింది. కలోరీ కంట్రోల్ కౌన్సిల్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 6 వేల ఉత్పత్తుల్లో అస్పర్టమే (కృత్రిమ స్వీటెనర్ల)ను వినియోగిస్తున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.