GPS Spoofing: ఇరాన్, ఇరాక్ గగనతలంలో దారి తప్పుతున్న విమానాలు.. అక్కడ ఏం జరుగుతోందని ఆందోళన

|

Oct 02, 2023 | 7:30 AM

విమానాలు దారి తప్పడానికి కారణం నకిలీ జీపీఎస్‌ సిగ్నల్స్‌ వల్లే అంటూ ప్రాధమికంగా గుర్తించారు. ఈ నకిలీ సిగ్నల్స్  విమాన వ్యవస్థలోని నావిగేషన్‌ వ్యవస్థను ఏమార్చి అవి దారి తప్పేలా చేస్తున్నాయని అధికారులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సిగ్నల్స్ సరిగా పనిచేయక పోవడంతో ఇలా దారి తప్పిన విమానాల్లో బోయింగ్‌ 777, బోయింగ్‌ 737, 747 సహా పలు ఇతర విమానాలు ఉన్నాయని వెల్లడించారు. 

GPS Spoofing: ఇరాన్, ఇరాక్ గగనతలంలో దారి తప్పుతున్న విమానాలు.. అక్కడ ఏం జరుగుతోందని ఆందోళన
Gps Spoofing
Follow us on

సాధారణంగా ఏదైనా సాంకేతిక లోపం తలెత్తినప్పుడో.. వాతావరణం అనుకూలించనప్పుడో విమానాలు దారి తప్పుతాయి. అయితే ఇరాన్‌ -ఇరాక్ మధ్య మాత్రం ఇలాంటివేమీ జరగకుండానే విమానాలు దారి తప్పిపోతున్నాయట. ఇరాన్‌- ఇరాక్‌ గగనతలంలో విమానాలు.. ఎదో అడవిలో దారి తప్పినట్లు దారి తప్పుతున్నాయి. ఇలా జరగడం ఒక్కసారి కాదు.. రెండు సార్లు కాదు తరచూ విమానాలు దారి తప్పుతున్నట్లు తప్పుతున్నాయి. గత 15 రోజుల వ్యవధిలో దాదాపు 20 విమానాలు గగనతలంలో తమ గమ్యాన్ని విడిచి దారి వేరే దారికి మళ్లినట్లు ఫ్లైట్‌ డేటా ఇంటెలిజెన్స్‌ వెబ్‌సైట్‌ ‘ఓపీఎస్‌ గ్రూప్‌’ ప్రకటించింది.

ఇలా తరచుగా విమానాలు దారి తప్పడానికి కారణం నకిలీ జీపీఎస్‌ సిగ్నల్స్‌ వల్లే అంటూ ప్రాధమికంగా గుర్తించారు. ఈ నకిలీ సిగ్నల్స్  విమాన వ్యవస్థలోని నావిగేషన్‌ వ్యవస్థను ఏమార్చి అవి దారి తప్పేలా చేస్తున్నాయని అధికారులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సిగ్నల్స్ సరిగా పనిచేయక పోవడంతో ఇలా దారి తప్పిన విమానాల్లో బోయింగ్‌ 777, బోయింగ్‌ 737, 747 సహా పలు ఇతర విమానాలు ఉన్నాయని వెల్లడించారు.

ఎంతగా పైలట్లను ఈ సిగ్నల్స్ దారి తప్పిస్తున్నాయంటే.. బోయింగ్‌ 777 విమానంలోని పైలట్లకైతే.. అసలు వారు ఎక్కడ ఉన్నారో వారికే అర్ధం కాలేదని ఓపీఎస్‌ గ్రూప్ చెప్పింది. దీంతో వారు వెంటనే బాగ్దాద్‌లోని ‘ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌’ను సంప్రదించారు. తాము ఇప్పుడు అసలు ఎప్పుడు ఎక్కడ ఉన్నాము.. టైం ఎంత అని అడిగారని తెలుస్తోంది. మరో ఘటనలో ఎంబ్రార్‌ లెగసీ 650 విమానం క్లియరెన్స్‌ లేకుండా ఇరాన్‌ గగనతలంలోకి ప్రవేశించినట్లు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

అయితే ఇలా విమానాలు దారి తప్పుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్న ప్రాంతాల్లో భారత్‌ దేశానికి చెందిన ఎయిరిండియా, ఇండిగో, విస్తారా విమానాలు సైతం తరచూ ప్రయాణిస్తుంటాయి. భారత దేశం  నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో, ఇస్తాంబుల్‌, లండన్‌కు వెళ్లే విమానాలు ఈ గగనతలం మార్గాల నుంచి ప్రయాణిస్తాయి.

ఎయిరిండియా, ఇండిగో సంస్థలు బోయింగ్‌ 777 రకం విమానాలను నడుపుతున్నాయి.  దీంతో ఈ ప్రాంతాల్లో ప్రయాణించే భారత దేశానికి చెందిన విమానాలు కూడా ఫేక్ సిగ్నల్ భారిన పడే అవకాశాలు ఉన్నాయనే ఆందోళన చెందుతున్నారు.

వాస్తవానికి నావిగేషన్‌ వ్యవస్థను ప్రభావితం చేసి నకిలీ జీపీఎస్‌ ద్వారా విమానాలను దారి మళ్లించే ప్రక్రియను జీపీఎస్‌ సిగ్నల్‌ స్పూఫింగ్‌ అంటారు. ఇలాంటి ఘటనలు గత పదేళ్లుగా అడపాదడపా వెలుగులోకి వస్తున్నాయి. అయితే  పౌర విమానాలను ఈ స్థాయిలో టార్గెట్‌ చేయడం మాత్రం ఇదే తొలిసారంటూ ఆందోళలన వ్యక్తం అవుతున్నాయి.

మరిన్ని అంతర్జాతీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..