దుబాయ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అది ఎక్కడో కాదు.. ప్రపంచ ప్రసిద్ది గాంచిన భవనం పక్కనే ఉన్న మరో భవనం మంటల్లో చిక్కుకుంది. ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా ప్రసిద్ధిగాంచిన దుబాయిలోని బుర్జ్ ఖలీఫా సమీపంలో ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుర్జ్ ఖలీఫాకు అతి సమీపంలో ఉన్న ఎమార్ అపార్ట్‌మెంట్‌లో మంటలు అంటుకున్నాయి. పదుల సంఖ్యలోని అంతస్తుల్లో అగ్ని కీలలు చెలరేగుతున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎవరైనా బాధితులు ఉన్నారా? అనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదని స్థానిక మీడియాలు పేర్కొన్నాయి. దుబాయి ప్రభుత్వ అధీనంలోని ఎమార్ సంస్థ నిర్మించిన 8 బౌలెవార్డ్ వాక్ అపార్ట్‌మెంట్‌లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ప్రమాదం గురించిన సమాచారం అందుకున్న వెంటనే అక్కడి ఫైర్ సిబ్బంది, ఇతర అధికారులు అలర్ట్ అయ్యారు. కాసేపట్లోనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇప్పటి వరకు అయితే ఎవరూ మరణించినట్లుగానీ, గాయపడినట్లు గానీ నిర్ధారించలేదు అధికారులు. అయితే, ఒక్కసారిగా అంత పెద్ద భవనంలో మంటలు చెలరేగడంలో బిల్డింగ్‌లో ఉంటున్న వారితో పాటు, స్థానికులు సైతం భయంతో పరుగులు తీశారు.
1/ #Dubai
The Emaar skyscraper of the largest developer in Dubai partially burned down
The fire started early this morning near the Burj Khalifa, the tallest building in the world. pic.twitter.com/frFKZI1zu9
— David Kime (@CyberRealms1) November 7, 2022
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..