లాహోర్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది కాల్చివేత.. గుర్తుతెలియని ముష్కరుల దాడిలో హతం

|

May 07, 2023 | 8:17 AM

వాంటెడ్ ఖలిస్తానీ ఉగ్రవాది పరమ్‌జిత్ సింగ్ పంజ్వార్‌ (63) పాకిస్థాన్‌ రాజధాని లాహోర్‌లో ఇద్దరు గుర్తు తెలియని ముష్కరులు కాల్చి చంపారు. పంజాబ్‌ ప్రావిన్స్‌ లాహోర్‌లోని తోఖర్ నియాజ్ బేగ్ సమీపంలోని నవాబ్ టౌన్, సన్‌ఫ్లవర్ హౌసింగ్ సొసైటీ పార్కు మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన..

లాహోర్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది కాల్చివేత.. గుర్తుతెలియని ముష్కరుల దాడిలో హతం
Paramjit Singh Panjwar
Follow us on

వాంటెడ్ ఖలిస్తానీ ఉగ్రవాది పరమ్‌జిత్ సింగ్ పంజ్వార్‌ (63) పాకిస్థాన్‌ రాజధాని లాహోర్‌లో ఇద్దరు గుర్తు తెలియని ముష్కరులు కాల్చి చంపారు. పంజాబ్‌ ప్రావిన్స్‌ లాహోర్‌లోని తోఖర్ నియాజ్ బేగ్ సమీపంలోని నవాబ్ టౌన్, సన్‌ఫ్లవర్ హౌసింగ్ సొసైటీ పార్కు మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన పజ్వార్‌పై శనివారం ఉదయం ఇద్దరు గుర్తు తెలియని ముష్కరులు కాల్పులు జరిపారు. అనంతరం మోటర్‌ సైకిల్‌పై పరారయ్యారు. ఈ ఘటనలో పజ్వార్‌ తలపై కాల్చడంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. అతనితోపాటు అతని గార్డుకూడా మృతి చెందాడు.

నిషేధిత ఖలిస్తాన్ కమాండో ఫోర్స్-పంజ్వార్ గ్రూప్‌కు పజ్వార్ (KCF) నాయకుడు. 2020 జూలైలో డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్ వంటి పలు చట్టవిరుద్ధకార్యకలాపాల్లో అతన్ని ఉగ్రవాదిగా భారత్‌ ప్రకటించింది. హత్య జరిగిని ప్రాంతాన్ని ఐఎస్ఐ, మిలిటరీ ఇంటెలిజెన్స్ (MI), కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్‌తో సహా పాకిస్తాన్ గూఢచార సంస్థలు చుట్టుముట్టాయి. నేరం జరిగిన ప్రాంతానికి లాహోర్‌ పోలీసులు మీడియాను అనుమతించలేదు.

కాగా 1986లో కేసీఎఫ్‌ ఉగ్రవాద సంస్థలో చేరిన పంజ్వార్ ఆ తర్వాత పాకిస్తాన్‌కి పరారయ్యాడు. లాహోర్ కేంద్రంగా పాక్‌ యువకులకు ఆయుధ శిక్షణ ఇవ్వడం, ఆయుధాలు-మందుగుండు సామగ్రిని సరఫరా చేయడం, డ్రగ్స్‌ స్మగ్లింగ్‌, నకిలీ భారతీయ కరెన్సీ నోట్ల సరఫరా వంటి పలు ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఉగ్రవాద కార్యకలాపాల కోసం అధునాతన ఆయుధాలను కొనుగోలు చేయడానికి కావల్సిన ఆర్థిక వనరుల కోసం ఈ ఉగ్ర సంస్థ బ్యాంకు దోపిడీలు, కిడ్నాప్‌లకు పాల్పడేది. 1988 పంజాబ్‌లో జరిగిన బాంబు దాడి, ఫిరోజ్‌పూర్‌లో 10 మంది రాయ్ సిక్కులను హతమార్చడం, మేజర్ జనరల్ బీన్‌ కుమార్ హత్యలో పంజ్వార్ ప్రమేయం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.