Viral Video: టేకాఫ్‌ సమయంలో ఒక్కసారిగా పేలిన విమానం టైర్లు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే! వీడియో

అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. సరిగ్గా రన్‌వేపై టేకాఫ్‌ అవుతున్న సమయంలో విమానం టైరు ఒకటి ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్‌ 590 విమానం బుధవారం ఉదయం 8 గంటలకు ఫ్లోరిడాలోని టంపా ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఫీనిక్స్‌ సిటీకి బయల్దేరింది..

Viral Video: టేకాఫ్‌ సమయంలో ఒక్కసారిగా పేలిన విమానం టైర్లు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే! వీడియో
American Airlines Plane Tyre Blows On Runway

Updated on: Jul 12, 2024 | 11:08 AM

ఫ్లోరిడా, జులై 12: అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. సరిగ్గా రన్‌వేపై టేకాఫ్‌ అవుతున్న సమయంలో విమానం టైరు ఒకటి ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్‌ 590 విమానం బుధవారం ఉదయం 8 గంటలకు ఫ్లోరిడాలోని టంపా ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఫీనిక్స్‌ సిటీకి బయల్దేరింది. టేకాఫ్‌ అయ్యేందుకు టాక్సీ వే మీద నుంచి రన్‌వే మీదకు విమానం వచ్చింది. అయితే రన్‌వేపై విమానం వాలగానే ఒక్కసారిగా దాని కుడివైపు ఉన్న టైరు పేలిపోయింది. దీంతో విమానం చక్రాల్లోంచి నిప్పురవ్వలు ఎగసి.. పొగలు వ్యాపించాయి. ప్రమాదాన్ని గుర్తించిన పైలట్‌ రన్‌వేపై విజయవంతంగా విమానాన్ని టేకాఫ్‌ చేశాడు. విమానం ఆగిన వెంటనే ఎమర్జెన్సీ వెహికల్స్‌ హుటాహుటీన అక్కడికి చేరుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ప్రమాదానికి గురైన విమానంలో దాదాపు 174 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు ఎయిర్‌లైన్స్‌ తెలిపింది. అయితే ఎవరికీ.. ఎలాంటి.. గాయాలు తగలలేదని స్పష్టం చేసింది. వెంటనే విమానాన్ని ఖాళీ చేసి టెర్మినల్‌కు పంపినట్లు అమెరికన్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి అల్ఫ్రెడో గార్డునో తెలిపారు. తర్వాత ప్రయాణికులను మరో విమానంలో వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చినట్లుగా పేర్కొంది. ఈ ఘటన కారణంగా ఫ్లోరిడా ఎయిర్‌పోర్ట్‌లో ఇతర విమాన కార్యకలాపాలకు ఎలాంటి విఘాతం ఏర్పడలేదని ఎయిర్‌లైన్స్ తెలిపింది. మెకానికల్‌ సమస్య వల్ల ఇలా జరిగిందని, ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నట్లు అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ వివరణ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

‘అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 590 బుధవారం (జూలై 10) ఉదయం 7:50 గంటలకు టంపా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో టేకాఫ్‌ సమయంలో ఒకటికి మించి టైర్లు పేలినట్లు నివేదించడంతో.. ప్రయాణీకులను టాక్సీవేపై దింపి, టెర్మినల్‌కు తరలించారని’ యూఎస్‌ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA ఓ ప్రకటనలో తెలిపింది. అనంతరం ఫ్లైట్ ఫీనిక్స్ స్కై హార్బర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరింది. ఘటనపై FAA దర్యాప్తు చేస్తుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.