America President: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది. చిన్నా, పెద్దా, ముసలీ, ముతక అని తేడా లేకుండా లక్షలాది మంది ప్రాణాలను మింగేసింది. అంతేకాదు.. కోట్లమంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది మాయదారి కరోనా. ఈ వైరస్ వ్యాప్తి కారణంగా ఎంతో మంది ప్రజలు తమ ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. మరెంతో మంది ఆకలి చావులకు గురయ్యారు. అయితే, ఇలా ఉద్యోగాలు కోల్పోయి.. తీవ్ర అవస్థలు పడుతున్న ప్రజలను ప్రభుత్వాలు ఆదుకుంటాయని కొందరు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌కు ఓ మహిళ లేఖ రాసింది. ఆమె కూడా కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన బాధితురాలే. అయితే, ఆమెలాంటి ఎందరో ప్రజలు తమ ఉద్యోగాలు కోల్పోయి.. తీవ్ర అవస్థలు పడుతున్నారని గుర్తించి.. వారి కోసం ఏదైనా చేయాలని తలంచింది. ఆ క్రమంలోనే నూతన అధ్యక్షుడు బైడెన్‌కు కాలిఫోర్నియాకు చెందిన మిషెల్ వోల్ కెర్ట్ లేఖ రాసింది. కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయి కష్టాల్లో ఉన్న వారికోసం ఏమైనా చేయాలని ఆ లేఖలో వేడుకుంది.
అయితే, ఆమె రాసిన లేఖ చివరికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చేరింది. అది చదివిన ఆయన వెంటనే మిషెల్‌కు ఫోన్ చేశారు. వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. కరోనా కారణంగా తన కంపెనీలో చాలా మంది ఉద్యోగులను తీసేశారని, తాను కూడా ఉద్యోగం పోగుట్టుకున్నానని జో బైడెన్‌తో మిషెల్ మొరపెట్టుకున్నారు. ప్రస్తుత సమయంలో ఉద్యోగం దొరకడం కూడా కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. తనలాంటి ఎంతో మంది ఉద్యోగం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మీరే ఆదుకోవాలంటూ బైడెన్‌ను మిషెల్ వేడుకుంది. ఆమె చెప్పినవన్నీ విన్న బైడెన్.. కరోనా కారణంగా నష్టపోయిన వాందరినీ ఎమర్జెన్సీ రిలీఫ్ కింద ఆదుకుంటున్నట్లు వివరించారు. ఉద్యోగం అంటే ఒక గౌరవం అని, మర్యాద అని తన తండ్రి తనకు ఎప్పుడూ చెబుతుండేవారని బైడెన్ ఈ సందర్భంగ పేర్కొన్నారు. కరోనా కారణంగా నష్టపోయిన వారిని ఆదుకునేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటామని మిషెల్‌కు బైడెన్ హామీ ఇచ్చారు. కాగా, బైడెన్ హామీతో మిషెల్ సంతోషం వ్యక్తం చేసింది. బైడెన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. తాను రాసిన లేఖకు స్పందించి.. బైడెన్ తనకు ఫోన్ చేయడం చాలా ఆనందంగా ఉందని మిషెల్ చెప్పింది.
US President Joe Biden Tweet:
Last year, Michele lost her job because of the pandemic. I recently gave her a call to hear her story and discuss how my American Rescue Plan will help families like hers. pic.twitter.com/SAqM2GytPf
— President Biden (@POTUS) February 6, 2021
Also read:
విశాఖ స్టీల్ ప్లాంట్ స్ట్రాటజీ : నిన్నటి వరకూ సైలెంట్‌గా ఉండి, ఉన్నఫళంగా స్పీడు పెంచిన వైసీపీ నేతలు