విశాఖ స్టీల్ ప్లాంట్ స్ట్రాటజీ : నిన్నటి వరకూ సైలెంట్‌గా ఉండి, ఉన్నఫళంగా స్పీడు పెంచిన వైసీపీ నేతలు

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రమవుతోంది. దశలవారీగా పోరాటాన్ని తీవ్ర తరం చేసేందుకు అన్ని పక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎలాంటి స్టెప్స్‌తో కేంద్రంపై ఒత్తిడి..

విశాఖ స్టీల్ ప్లాంట్ స్ట్రాటజీ : నిన్నటి వరకూ సైలెంట్‌గా ఉండి, ఉన్నఫళంగా స్పీడు పెంచిన వైసీపీ నేతలు
Venkata Narayana

|

Feb 08, 2021 | 3:52 AM

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం తీవ్రమవుతోంది. దశలవారీగా పోరాటాన్ని తీవ్ర తరం చేసేందుకు అన్ని పక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎలాంటి స్టెప్స్‌తో కేంద్రంపై ఒత్తిడి పెంచాలనే ఆలోచన చేస్తున్నారు నేతలు. అందుకోసం రౌండ్ టేబుల్ సమావేశాలు, అఖిలపక్ష భేటీలు ఏర్పాటు చేస్తున్నారు. నిన్నటి వరకూ సైలెంట్‌గా ఉన్న వైసీపీ నేతలు సడెన్ గా స్పీడ్ పెంచారు. మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం షురూ చేశారు.

విశాఖ సర్క్యూట్ హౌస్‌లో మంత్రి అవంతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీలు సన్నాహక సమావేశం నిర్వహించాయి. ప్రైవేటీకరణ అడ్డుకోవడంపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశానికి విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి, CPI, CPM, కాంగ్రెస్ పార్టీల ప్రతినిధులు,కార్మిక సంఘాల నాయకులు హాజరయ్యారు. ఇవాళ మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. ఈ సమావేశాలకు టీడీపీ, బీజేపీలను పిలిచినా వాళ్లు రాకపోవడంపై మంత్రి అవంతి కామెంట్స్ చేశారు. రాజీనామాలు చేస్తే మాజీలు అవుతారు గానీ ప్రైవేటీకరణ ఆపలేరని అన్నారు మంత్రి. అలా చేస్తే గ్యాలరీకే పరిమితమవుతారని అన్నారు. ఎంపీ గా ఉంటే ప్రధానిని కలవొచ్చు, ఉన్నతాధికారులను కలవొచ్చన్నారు. పదవిలో ఉండే పోరాడాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకన్నారని కేంద్రంపై మంత్రి అవంతి మండిపడ్డారు. ఈ ఉదయం స్టీల్‌ ప్లాట్ బీసీ గేటు ముందు సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. మరోవైపు, విశాఖ స్టీల్‌ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ గుంటూరులో రౌండ్‌టేబుల్‌ సమావేశం జరిగింది. CPI కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో అఖిలపక్షం నేతలు పాల్గొన్నారు. విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఫ్యాక్టరీని కాపాడుకుందామని CPI సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. కేంద్రం కనిపించిన ప్రతి దాన్ని ప్రైవేట్‌ పరం చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. మోదీ సర్కార్‌ కుట్రలను తిప్పి కొట్టేందుకు ప్రతి ఒక్కరు ఉద్యమించాలన్నారు ముప్పాళ్ల నాగేశ్వరరావు.

విశాఖ ఉక్కుపై కేంద్ర నిర్ణయంతో కుదేలైన ఏపీ బీజేపీ నేతలు, ఢిల్లీ పెద్దల మనసు మారుస్తామంటూ నష్ట నివారణ చర్యలు

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu