
అమెరికా అధ్యక్షు డోనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో 41 దేశాలపై కఠినమైన ఆంక్షలు విధించాలని ట్రంప్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వార్తా సంస్థ రాయిటర్స్ కథనం ప్రకారం, డజన్ల కొద్దీ దేశాల పౌరులపై ప్రయాణ నిషేధం విధించే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు అంతర్గత మెమో సిద్ధమవుతున్నట్లు వెల్లడించింది.
అమెరికా ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్న ఈ మెమోరాండంలో 41 దేశాల జాబితా ఉన్నట్లు సమాచారం. వీటిని మూడు వేర్వేరు గ్రూపులుగా విభజించారు. ఈ జాబితాలో పాకిస్తాన్ పేరు కూడా ఉండటం విశేషం. దీనివల్ల ఇకపై పాకిస్తాన్ పౌరులు అమెరికాకు వెళ్లడం కష్టమవుతుంది.
మూడు గ్రూపులుగా విభజన
అయితే నివేదికల ప్రకారం, ఈ జాబితాలో మార్పులు, చేర్పులు సాధ్యమేనని పేరు వెల్లడించని ఒక అమెరికన్ అధికారి తెలిపారు. అంటే మరి కొన్ని కొత్త దేశాలను జోడించవచ్చని, కొన్ని దేశాలను తొలగించవచ్చని తెలుస్తోంది. అధికారిక ఆమోదం పొందిన తర్వాతే తుది జాబితా విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు
ట్రంప్ పరిపాలన వీసా ఆంక్షలు విధించడం అది కొత్త విధానం కాదు. తన మొదటి పదవీకాలంలో డొనాల్డ్ ట్రంప్ ఏడు ముస్లిం-మెజారిటీ దేశాల పౌరులపై ప్రయాణ నిషేధాన్ని విధించారు. దీనిని 2018లో సుప్రీంకోర్టు సమర్థించింది. రెండోసారి అమెరికా అధ్యక్షుడైన వెంటనే, డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ఒక కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేశారు. ఇది అమెరికాలోకి ప్రవేశించాలనుకునే విదేశీ పౌరుల భద్రతా తనిఖీలను మరింత కఠినతరం చేయాలని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వు ప్రకారం, మార్చి 21 నాటికి అనేక మంది కేబినెట్ సభ్యులను దేశాల జాబితాను సిద్ధం చేయాలని కోరారు. ఆ దేశాల పౌరుల ప్రయాణాన్ని పాక్షికంగా లేదా పూర్తిగా నిషేధించారు. ఈ జాబితా దర్యాప్తు, స్క్రీనింగ్ ప్రక్రియలో తీవ్రమైన లోపాలు గుర్తించిన దేశాలను చేర్చడానికి ఉద్దేశించినది. ఇదెలావుంటే,అక్టోబర్ 2023లో ఇచ్చిన ప్రసంగంలో, అమెరికా భద్రత దృష్ట్యా గాజా స్ట్రిప్, లిబియా, సోమాలియా, సిరియా, యెమెన్ మరియు ఇతర సున్నితమైన ప్రాంతాల నుండి వచ్చే ప్రజలను నిషేధిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..