6 రోజుల్లో శాంతి ఒప్పందంపై సంతకం చేస్తావా.. జైలుకు వెళ్తావా? జెలెన్‌స్కీకి ట్రంప్ అల్టిమేటం!

రష్యా-ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఏకంగా ఉక్రెయిన్ అధ్యక్షుు వోలోడిమిర్ జెలెన్‌స్కీకి అల్టిమేటం జారీ చేశారు. నవంబర్ 27 నాటికి 28 అంశాల శాంతి ప్రణాళికపై సంతకం చేయకపోతే, అధికారం నుంచి తొలగిస్తామని ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడికి వార్నింగ్ ఇచ్చారు. చూడాలి మరీ జెలెన్‌స్కీ స్పందిస్తారో మరీ..!

6 రోజుల్లో శాంతి ఒప్పందంపై సంతకం చేస్తావా.. జైలుకు వెళ్తావా? జెలెన్‌స్కీకి ట్రంప్ అల్టిమేటం!
Donald Trump Ultimatum To Ukraine President Zelenskyy

Updated on: Nov 21, 2025 | 12:25 PM

రష్యా-ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఏకంగా ఉక్రెయిన్ అధ్యక్షుు వోలోడిమిర్ జెలెన్‌స్కీకి అల్టిమేటం జారీ చేశారు. నవంబర్ 27 నాటికి 28 అంశాల శాంతి ప్రణాళికపై సంతకం చేయకపోతే, అధికారం నుంచి తొలగిస్తామని ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడికి వార్నింగ్ ఇచ్చారు.

“అధికారం నుండి తొలగించిన తర్వాత, మిమ్మల్ని వెంటనే జైలుకు పంపుతారు. ఏ క్షణమైనా, ఇప్పుడే యుద్ధాన్ని ఆపాలని మేము కోరుకుంటున్నాము” అని ట్రంప్ జెలెన్‌స్కీని బెదిరించాడు. ట్రంప్ నుండి వచ్చిన ఈ కఠినమైన సందేశాన్ని అమెరికా విదేశాంగ శాఖ జెలెన్‌స్కీకి తెలియజేసింది.

ఉక్రెయిన్ అధ్యక్షుడి సన్నిహితులు చాలా మందిపై ఇటీవల తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. వారిలో ఇద్దరు జెలెన్‌స్కీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారు. ఇద్దరినీ వారి పదవుల నుండి తొలగించారు. ఈ కేసుల కారణంగా జెలెన్‌స్కీ ఒత్తిడిలో ఉన్నాడు. ఈ మంత్రులను చాలా కాలంగా ఆదరిస్తున్నాడని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇద్దరు క్యాబినెట్ మంత్రులకు సంబంధించిన అవినీతి కుంభకోణం జెలెన్‌స్కీకి కూడా చేరవచ్చు. అమెరికా దీనిని ఒక అవకాశంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తోంది.

అమెరికా శాంతి ప్రణాళిక ఏమిటి?

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి అమెరికా ప్రభుత్వం రహస్యంగా ఒక శాంతి ప్రణాళికను రూపొందించింది. ఈ ప్రణాళికలో రెండు కీలక అంశాలు ఉన్నాయి.

మొదటిది: యుద్ధం తర్వాత ఉక్రెయిన్ సార్వభౌమ దేశంగా అనుభవిస్తున్న అన్ని హక్కులను కొన్ని షరతులకు లోబడి కలిగి ఉంటుంది.

రెండవది: యూరప్, రష్యా-ఉక్రెయిన్ మధ్య మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు పూర్తిగా పరిష్కరించాలి. ఈ ప్రయోజనం కోసం కొన్ని షరతులు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని 28-పాయింట్ల ఒప్పందం అని పిలుస్తారు. ఈ షరతులలో రష్యాపై ఎప్పుడూ దాడి చేయకూడదని, నాటోను విస్తరించకుండా ఉండాలనే నిబద్ధత కూడా ఉంది.

ఉక్రెయిన్ తో సమస్యలు ఏమిటి?

రష్యా – ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపడానికి జెలెన్‌స్కీ ఇటీవల టర్కీలో పర్యటించారు. యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించడానికి జెలెన్‌స్కీ ప్రయత్నిస్తున్నారు. అయితే, అమెరికా సిద్ధం చేసిన 28 పాయింట్ల ప్రతిపాదనలోని కొన్ని షరతులతో ఉక్రెయిన్ అసౌకర్యంగా ఉంది. వీటిలో ముఖ్యమైనవి ఏమిటంటే క్రిమియా, డొనెట్స్క్, లుహాన్స్క్ రష్యాలో భాగంగా అంతర్జాతీయ గుర్తింపు పొందుతాయి. ఖేర్సన్ – జాపోరిజియా ప్రాంతాలను ఉక్రెయిన్‌లో భాగంగా పరిగణిస్తారు. అవి అక్కడే ఉన్నాయి. రష్యా మిగిలిన ఆక్రమిత ప్రాంతాల నుండి వైదొలగుతుంది. ఈ నగరాలను రష్యాకు ఏ ధరకైనా వదులుకోవడానికి ఉక్రెయిన్ సిద్ధంగా లేదు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us