పశ్చాత్తాప పడుతున్న డొనాల్డ్ ట్రంప్.. నరేంద్ర మోదీని గొప్ప ప్రధానిగా అభివర్ణించిన ట్రంప్

సుంకాలతో దెబ్బతీసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌ దూరమయినందుకు బాధపడుతున్నారు. భారతదేశం, రష్యా దేశాలు చైనా చేతిలోకి వెళ్లిపోయాయని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై వెనుక్కు తగ్గారు. మేము భారతదేశంపై చాలా ఎక్కువ సుంకాలను విధించామని ట్రంప్ పశ్చాత్తాప పడ్డారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చాలా మంచి సంబంధం ఉందని, ఆయన చాలా గొప్ప ప్రధానమంత్రి అని అన్నారు.

పశ్చాత్తాప పడుతున్న డొనాల్డ్ ట్రంప్.. నరేంద్ర మోదీని గొప్ప ప్రధానిగా అభివర్ణించిన ట్రంప్
Narendra Modi ,donald Trump

Updated on: Sep 06, 2025 | 8:45 AM

భారత్‌పై సుంకాలు విధించినందుకు డొనాల్డ్ ట్రంప్‌ మనోవేదనకు గురవుతున్నారు. భారత్‌తో పాటు చైనాకు అమెరికా దూరమయ్యాయని, చైనాకు దగ్గరయ్యాయని మధనపడుతున్నారు. తియాన్‌జిన్‌ వేదికగా జరిగిన SCO సదస్సులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్‌, చైనా అధ్యక్షులు జిన్‌పింగ్‌ల ఫోటోను తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లో షేర్‌ చేశారు ట్రంప్‌.

సుంకాలతో దెబ్బతీసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌ దూరమయినందుకు బాధపడుతున్నారు. భారత్‌తో పాటు రష్యా తమకు దూరమైనట్టు అని భావిస్తునట్టు తెలిపారు. చైనాకు ఈ రెండు దేశాలు దగ్గరయ్యాయని అన్నారు. ఇటీవల చైనాలో జరిగిన SCO సదస్సులో మోదీ, పుతిన్‌, జిన్‌పింగ్‌ల ఫోటోను తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లో షేర్‌ చేశారు ట్రంప్‌. మూడు దేశాల మధ్య మైత్రీ చాలా కాలం కొనసాగుతుందని భావిస్తునట్టు పేర్కొన్నారు ట్రంప్‌. టియాన్‌జిన్‌ వేదికగా జరిగిన SCO సదస్సులో మోదీ, పుతిన్‌, జిన్‌పింగ్‌ సుంకాలకు విరుగుడుపై లోతుగా చర్చించారు. దీనిపై స్పందించారు ట్రంప్‌.

‘‘భారత్, రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తుందని చాలా నిరాశ చెందాను. నేను వారికి ఆ విషయాన్ని తెలియజేశాను. మేము భారతదేశంపై చాలా పెద్ద సుంకం విధించాము. 50 శాతం సుంకం, చాలా ఎక్కువ సుంకం.’’ అంటూ ట్రంప ప్రశ్చాత్తాపపడుతున్నారు. భారత్‌పై సుంకాలు విధించినందుకు లోలోన ఆయన బాధపడుతున్నారు. తన తీరు తోనే బద్దశత్రువులైన భారత్‌, చైనాలో ఏకమైనట్టు ట్రంప్‌ ఆవేదన చెందుతున్నట్టు తెలుస్తోంది. భారత్‌, రష్యా, చైనా లాంటి శక్తివంతమైన దేశాలు ఏకం కావడం అమెరికాకు చాలా నష్టమనే భావన ఆ దేశం లోని పలువురు ఆర్ధిక, రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.

తనపై విమర్శలు వెల్లువెత్తడంతో ట్రంప్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తనకున్న వ్యక్తిగత సంబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. “నేను నరేంద్ర మోదీతో చాలా బాగా కలిసిపోతాను. ఆయన చాలా గొప్పవాడు. ఆయన రెండు నెలల క్రితం ఇక్కడి వచ్చి వెళ్లారు” అని ట్రంప్ అన్నారు. భారతదేశం మరియు అమెరికా మధ్య “చాలా ప్రత్యేకమైన సంబంధం” ను అధ్యక్షుడు పునరుద్ఘాటించారు, అప్పుడప్పుడు విభేదాలు ఉన్నప్పటికీ తాను, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ “ఎల్లప్పుడూ స్నేహితులుగా” ఉంటామని స్పష్టం చేశారు.

భారతదేశంతో సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని విలేకరులు అడిగినప్పుడు, “నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. భారత ప్రధాని మోదీతో స్నేహంగా ఉంటాను. ఆయన గొప్ప ప్రధానమంత్రి. నేను ఎల్లప్పుడూ స్నేహితులుగా ఉంటాను, కానీ ఈ ప్రత్యేక సమయంలో ఆయన ఏమి చేస్తున్నారో నాకు నచ్చడం లేదు. కానీ భారతదేశం-అమెరికా మధ్య చాలా ప్రత్యేకమైన సంబంధం ఉంది. చింతించాల్సిన అవసరం లేదు. మనకు అప్పుడప్పుడు ఇలాంటి క్షణాలు ఉంటాయి.” అంటూ పేర్కొన్నారు.

డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యల భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందించారు. “ఈ పోస్ట్‌పై ప్రస్తుతానికి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేను” అని అన్నారు. ఇదిలావుంటే, గత నెలలో న్యూఢిల్లీపై ట్రంప్ విధించిన 50 శాతం సుంకాల తర్వాత భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు సంవత్సరాలలో అత్యంత కనిష్ట స్థాయికి దిగజారాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై భారత్‌పై అమెరికా 25 శాతం బేస్ సుంకాలను, మరో 25 శాతం లెవీని విధించింది.

మరోవైపు అమెరికాలోని ప్రముఖ టెక్నాలజీ సంస్థల అధిపతులు, సీఈవోలకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విందు ఇచ్చారు. వైట్‌హౌస్‌లో మెలానియా ట్రంప్‌ ఆధ్వర్యంలో జరిగిన ఏఐ ఈవెంట్‌ అనంతరం ఈ డిన్నర్‌ ఏర్పాటు చేశారు. దీనికి టిమ్‌కుక్‌, సుందర్‌ పిచాయ్‌, జుకర్‌బర్గ్‌, సత్యనాదెళ్ల వంటి పలువురు టెక్‌ దిగ్గజాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమెరికాలో పెట్టుబడుల గురించి ట్రంప్‌ వారిని సూటిగా ప్రశ్నించారు. ఇన్నాళ్లూ మీరు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టింది చాలు. ఇక స్వదేశానికి తిరిగిరండి..ఎంత పెట్టుబడి పెడతారు? అంటూ యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ను ట్రంప్‌ అడిగారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..