
అమెరికా ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఫైటర్ జెట్ ఎఫ్-16సీ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. దక్షిణ కాలిఫోర్నియాలోని ట్రోనా ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం (డిసెంబర్ 03) కాలిఫోర్నియాలో ఒక F-16 ఫైటర్ జెట్ కూలిపోయింది. US వైమానిక దళానికి చెందిన ఎలైట్ థండర్‌బర్డ్స్ స్క్వాడ్రన్‌కు చెందిన F-16 ఫైటర్ జెట్ కాలిఫోర్నియాలోని ట్రోనా విమానాశ్రయం సమీపంలో కూలిపోయింది. పైలట్లు గాయపడకుండా సురక్షితంగా బయటపడగలిగారు. అయితే, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.
ఈ సంఘటన స్థానిక కాలమానం ప్రకారం బుధవారం (డిసెంబర్ 03) ఉదయం 10:45 గంటలకు డెత్ వ్యాలీకి దక్షిణంగా ఉన్న మారుమూల ఎడారి ప్రాంతంలో జరిగింది. ఫైటర్ జెట్ కూలిపోయినట్లు అనేక వీడియోలు బయటకు వచ్చాయి. పైలట్ పారాచూట్ ఉపయోగించి సురక్షితంగా బయటకు వచ్చే ముందు విమానం నేలపైకి కూలిపోయింది. ఫైటర్ జెట్ భూమిని ఢీకొన్న వెంటనే పేలిపోయింది. ఆకాశంలోకి పెద్ద ఎత్తున పొగలు వచ్చాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.
ఈ ప్రమాద ఘటనను ధృవీకరిస్తూ థండర్‌బర్డ్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. కాలిఫోర్నియాలో నియంత్రిత గగనతలంపై శిక్షణా మిషన్‌లో భాగంగా థండర్‌బర్డ్ పైలట్ F-16C ఫైటింగ్ ఫాల్కన్ విమానం ఈ ఘటన జరిగినట్లు అమెరికన్ ఎయిర్‌ఫోర్స్ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, పైలట్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. శాన్ బెర్నార్డినో కౌంటీ అగ్నిమాపక అధికారులు తమ బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. విమానంలో పైలట్ మాత్రమే ఉన్నారని నిర్ధారించారని అధికారులు తెలిపారు.
వీడియో ఇక్కడ చూడండి..
Moment F-16C fighter jet crashes near Trona Airport in California. https://t.co/ND38ddIP5B pic.twitter.com/knsgPCUFsY
— Breaking911 (@Breaking911) December 3, 2025
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..