America Shooting: అమెరికాలోని గురుద్వారాలో కాల్పుల కలకలం.. ఇద్దరికి తీవ్ర గాయాలు..

|

Mar 27, 2023 | 10:06 AM

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. గురుద్వారలో జరిపిన కాల్పుల్లో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. ఈ కాల్పుల ఘటన కాలిఫోర్నియా శాక్రమెంటో కౌంటీలో జరిగింది.

America Shooting: అమెరికాలోని గురుద్వారాలో కాల్పుల కలకలం.. ఇద్దరికి తీవ్ర గాయాలు..
Gun Fire
Follow us on

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. గురుద్వారలో జరిపిన కాల్పుల్లో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. ఈ కాల్పుల ఘటన కాలిఫోర్నియా శాక్రమెంటో కౌంటీలో జరిగింది. ముగ్గురు వ్యక్తుల మధ్య కాల్పులు జరిగినట్టు యూఎస్ పోలీసులు తెలిపారు. సిక్కు సొసైటీకి చెందిన గురుద్వారాలో మధ్యాహ్నం 2:30 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) కాల్పులు జరిగినట్లు కౌంటీ షెరీఫ్ కార్యాలయం పేర్కొంది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపింది.

అయితే ఈ కాల్పులు ద్వేషపూరిత నేరానికి సంబంధించినవి కాదని.. తెలిసిన వ్యక్తుల మధ్యే కాల్పులు జరిగినట్లు శాక్రమెంటో కౌంటీ షెరీఫ్ కార్యాలయం పేర్కొంది. వ్యక్తిగత కక్షలు దీనికి కారణంగా అనుమానిస్తున్న పోలీసులు.. మొత్తం ముగ్గురు వ్యక్తులు మధ్య కాల్పులు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

ఈ ఘటనలో బాధితులు, నిందితులు ఒకరికొకరు తెలిసినవారేనని పోలీసులు పేర్కొన్నారు . కాల్పులకు ముందు ముగ్గురి (ఇద్దరు స్నేహితులు.. మరొకరు ప్రత్యర్థి) మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త పెరగగా కాల్పుల వరకు వెళ్లింది. అయితే ఇది ఇంతకు ముందు ఉన్న ఘర్షణల నేపథ్యంలో జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

ఇదిలాఉంటే.. యునైటెడ్ స్టేట్స్ లో గత కొన్ని రోజులుగా గన్ కల్చర్ పెరుగుతున్న విషయం తెలిసిందే. కొన్ని సంవత్సరాలు దేశంలో కాల్పుల ఘటనల కేసులు అనేకం చోటుచేసుకున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..