Viral: గడ్డకట్టే చలిలో 3 ఏళ్లుగా టెంట్ లోనే నిద్ర.. పదేళ్ల బాలుడి సాహసం..

Anil kumar poka

Anil kumar poka |

Updated on: Mar 27, 2023 | 9:24 AM

ఓ ఎన్జీవోకు నిధులు సమకూర్చడం కోసం పదేళ్ల బాలుడు రోజూ బయట టెంటు వేసుకొని మూడేళ్లుగా నిద్రపోయాడు. ఇలా చేసి ఏడు కోట్ల రూపాయల నిధులు సమకూర్చాడు.

ఓ ఎన్జీవోకు నిధులు సమకూర్చడం కోసం పదేళ్ల బాలుడు రోజూ బయట టెంటు వేసుకొని మూడేళ్లుగా నిద్రపోయాడు. ఇలా చేసి ఏడు కోట్ల రూపాయల నిధులు సమకూర్చాడు. ఇప్పుడు ఆరుబయటకు నిద్రకు ముగింపు పలకనున్నాడు. ఎందుకో స్టోరీ పూర్తిగా చూసేయండి. బ్రిటన్‌కు చెందిన మ్యాక్స్‌ వూజీ .. ఇంటి పక్కన ఉన్న వృద్ధుడు రిక్‌ అబాట్‌తో క్లోజ్‌గా మెలిగేవాడు. 74ఏళ్ల వయసులో ఆయన క్యాన్సర్ తో చనిపోయారు. అంతకుముందే రిక్‌ తన దగ్గరున్న టెంట్‌ను మ్యాక్స్‌కు ఇచ్చాడు. దీంతో ఏదైనా సాహస కార్యం చేయమని ఆయన చెప్పిన మాటలు మ్యాక్స్‌ మెదడులో బలంగా నాటుకుపోయాయి. దాంతో 2020 మార్చిలో తాను ఇంట్లో కాకుండా మూడేళ్లపాటు ఆరుబయట టెంట్‌లో నిద్రించాలని నిర్ణయం తీసుకున్నట్లు మ్యాక్స్‌ మీడియాకు తెలిపాడు. ఇలా చేయడం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఓ స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వాలనుకున్నట్లు ప్రకటించాడు. అప్పటి నుంచి మ్యాక్స్‌ను ప్రోత్సహిస్తూ పలువురు తనకు విరాళాలు పంపించారు. ఆ మొత్తం ఇప్పుడు దాదాపు 7 కోట్ల రూపాయలకు చేరింది. మ్యాక్స్‌ కృషికి గుర్తింపుగా పలు అవార్డులు కూడా దక్కాయి. బ్రిటిష్‌ అంపైర్‌ మెడల్‌, బేర్‌గ్రిల్స్‌ చీఫ్‌ స్కౌట్‌ అన్‌సంగ్ హీరో అవార్డు, ఎ ప్రైడ్‌ ఆఫ్‌ బ్రిటన్‌ అవార్డులు అతడిని వరించాయి. మ్యాక్స్‌ తన మూడేళ్ల టెంట్‌ నిద్రను ముగించేముందు ఏప్రిల్ 1న సంబరాలు చేయబోతున్నాడు. ఈ సందర్భంగా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాడు. ఆ టికెట్ల విక్రయం ద్వారా వచ్చిన డబ్బును స్వచ్ఛంద సంస్థకు పంపించనున్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jr.NTR – Ram Charan: ఎన్టీఆర్ తోపా..! రామ్ చరణ్ తోపా ..? డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్..
Viral Video: ఇది బైక్ కాదు పుష్పక విమానం.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..! వైరల్ వీడియో..
Vidya Balan: ఆ దర్శకుడు నన్ను రూమ్‌కు రమ్మన్నాడు.. విద్యాబాలన్‌. వీడియో

Follow us

Click on your DTH Provider to Add TV9 Telugu