Queen Elizabeth: రెండేళ్ల వయసు నాటి ఎలిజబెత్‌ రాణి ఫోటో.. 96వ పుట్టిన రోజున షేర్‌ చేసిన బ్రిటన్‌ క్వీన్‌

Queen Elizabeth: యూకే క్వీన్‌ ఎలిజబెత్‌ II 96వ పుట్టి రోజు వేడుకలు (Birthday Celebrate) గురువారం సాండ్రింగ్‌హమ్‌లో జరుపుకొంది. ట్విట్టర్‌లో ..

Queen Elizabeth: రెండేళ్ల వయసు నాటి ఎలిజబెత్‌ రాణి ఫోటో.. 96వ పుట్టిన రోజున షేర్‌ చేసిన బ్రిటన్‌ క్వీన్‌

Updated on: Apr 21, 2022 | 6:31 PM

Queen Elizabeth: యూకే క్వీన్‌ ఎలిజబెత్‌ II 96వ పుట్టి రోజు వేడుకలు (Birthday Celebrate) గురువారం సాండ్రింగ్‌హమ్‌లో జరుపుకొంది. ట్విట్టర్‌లో ది రాయల్ ఫ్యామిలీ ఖాతాలో ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని ఎలిజబెత్‌ రాణి  ఫోటోను విడుదల చేశారు. ఆ ఫోటో రెండు సంవత్సరాల వయసు నాటిది. ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్, లేబర్ లీడర్ కైర్ స్టార్మర్ పుట్టినరోజు శుభాకాంక్షలు పంపారు. అయితే ప్రపంచంలో అత్యంత వృద్దరాణిగా, ఎక్కువ కాలం పాలించిన క్వీన్‌గా ఎలిజబెత్‌ పేరు గడించారు. ఈ సందర్భంగా మ్యాటల్‌ సంస్థ క్వీన్‌ ఎలిజబెత్‌ బార్బీ డాళ్‌ను విడుదల చేసింది. అచ్చం ఎలిజబెత్‌లా ఉన్న ఆ బొమ్మను త్వరలో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.  అయితే క్వీన్‌ ఎలిజబెత్‌కు ఈ ఏడాదితో 96 సంవత్సరాలు నిండాయి. ఆమె ఏప్రిల్‌ 21, 1926లో జన్మించారు. ఏప్రిల్ 21న కుటుంబ సభ్యుల సమక్షంలో వేడుకలు జరుగుతాయి.

అయితే బ్రిటన్ రాణి పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతాయి. వేడుకల రోజు హైడ్ పార్క్‌లో 41-గన్ సెల్యూట్, విండ్సర్ గ్రేట్ పార్క్‌లో 21-గన్ సెల్యూట్, లండన్ టవర్ వద్ద 62-గన్ సెల్యూట్ నిర్వహిస్తారు. ఆమె పుట్టిన రోజు ప్రజల సమక్షంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. రాజవంశస్తుల జన్మదిన వేడుకలను ఆ దేశంలో ‘ట్రూపింగ్ ఆఫ్ కలర్స్ పరేడ్’ పేరుతో ఒక గొప్ప వేడుకలా నిర్వహిస్తారు. బ్రిటిష్ రాజవంశీయుల అధికారిక జన్మదిన వేడుకలను వేసవిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించడం ఒక సంప్రదాయం.

ఎలిజబెత్ వెస్ట్‌మినిస్టర్ అబ్బేలో ప్రిన్స్ ఫిలిప్‌ను వివాహం చేసుకుంది. వారి మొదటి సంతానం ప్రిన్స్ చార్లెస్. 1948లో జన్మించాడు. 1952లో 25 ఏళ్ల యువరాణి ఎలిజబెత్ ఫిలిప్‌తో కలిసి కెన్యాను సందర్శిస్తుండగా, ఫిబ్రవరి 6, 1952న ఆమె తండ్రి 56 ఏళ్ల వయసులో మరణించారు. దీంతో ఆమె పర్యటనను ముగించుకుని తిరిగి బ్రిటన్‌కు వెళ్లారు. జూన్ 2, 1953న వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బేలో 8,500 మంది అతిథుల సమక్షంలో ఆమెకు పట్టాభిషేకం జరిగింది. ఈ వేడుకను ప్రపంచవ్యాప్తంగా వీక్షించారు. రాణి 21 సంవత్సరాల వయస్సులో చేసిన ప్రసంగంలో బ్రిటన్, కామన్వెల్త్‌కు జీవితాంతం సేవ చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.

 


ఇవి కూడా చదవండి:

Boris Johnson: సబర్మతి ఆశ్రమంలో బ్రిటన్ ప్రధాని.. నూలు వడికిన బోరిస్ జాన్సన్..

Russia: తగ్గేదేలే అంటున్న రష్యా.. యుద్ధం మధ్యలో అణ్వాయుధ క్షిపణి ప్రయోగం.. Watch Video