ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ కారు ప్రమాదానికి గురైంది. అధ్యక్షుడి కారు కాన్వాయ్‌లోకి మరో కారు దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో జెలెన్‌స్కీకి స్వల్పగాయాలయ్యాయి. వెంటనే జెలెన్స్కీని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. జెలెన్‌స్కీకి స్వల్పగాయాలు అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదమేమీ లేదని భద్రతా అధికారులు ప్రకటించారు. అయితే ప్రమాదఘటనపై దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ ఘటనపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సీరియస్‌గా విచారణ జరుపుతుందని అధికార ప్రతినిధి తెలిపారు.
స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను..
అదే సమయంలో, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరో స్టేజ్‌కు చేరుకుంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 200 రోజులు దాటిన నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. తొలినాళ్లలో రష్యా దూకుడు ప్రదర్శించగా.. ఇప్పుడు ఉక్రెయిన్ ఆధిపత్యం మొదలు పెట్టింది. ప్రారంభంలో రష్యా ఆక్రమించుకున్న భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకుంటోంది. ఆయా ప్రాంతాల్లో ఉక్రెయిన్ జెండాలను ఎగురవేస్తోంది.
అయితే స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను స్వయంగా అధ్యక్షుడు జెలెన్స్కీ సందర్శిస్తున్నారు. యుద్ధంలో పాల్గొన్న సైనికులను ప్రశంసిస్తు.. ధన్యవాదాలు తెలిపారు. ఇజియం చాలా వరకు నాశనం చేయబడింది. అపార్ట్‌మెంట్ భవనాలు మంటల పొగతో నల్లబడి, ఫిరంగి దాడులతో దద్దరిల్లుతున్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం