ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉక్రెయిన్‌కు చెందిన ముగ్గురు మంత్రులతో సహా 18 దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో 10 మంది పిల్లలతో సహా 22 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఉక్రెయిన్‌లోని బ్రోవరీ పట్టణంలో ఈ హెలీకాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఉక్రెయిన్ అంతర్గత భద్రత మంత్రి, ఇతర సీనియర్ అధికారులు సహా 18 మంది మరణించారని ఉక్రెయిన్ పోలీసు చీఫ్ బుధవారం తెలిపారు. ఉక్రెయిన్ హోంమంత్రి డెన్నిస్ మొనస్ట్రిస్కీ, డిప్యూటీ హోంమంత్రి యెహెన్ యెనిన్, విదేశాంగశాఖ కార్యదర్శి యూరీ లుబ్కోవిచ్ చనిపోయారని ప్రకటించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
హెలికాప్టర్ కూలిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 10 మంది పిల్లలతో సహా 22 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఉక్రెయిన్ యుద్దంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేసే ముందు ఈ ప్రమాదం జరిగింది. కైవ్ రీజియన్ గవర్నర్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. హెలికాఫ్టర్ నివాస భవనాల సమీపంలో కిండర్‌గార్టెన్‌పై కుప్పకూలినట్లు వెల్లడించారు.
హెలికాప్టర్ క్రాష్ అయిన సమాచారం అందుకున్న పోలీసు యంత్రాంగం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని వెంటనే అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. హెలికాప్టర్ సాంకేతిక లోపంతో క్రాష్ అయిందా..? లేక ఈ ఘటన వెను మరేదైనా కారణం ఉందా అనే వివరాలు తెలియాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, హెలికాప్టర్ ప్రమాదం వెనుక కుట్ర ఉందని ఉక్రెయిన ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
కుట్ర కోణంలో ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..