Russia – Ukreine 2nd phase war: రష్యా.. ఉక్రెయిన్ మధ్య పోరు రెండో దశకు చేరింది.. ఇప్పటి వరకూ నష్టమే తప్ప అనుకున్నది సాధించలేకపోయిన రష్యా.. ఉక్రెయిన్‌పై దాడులను మరింత తీవ్రం చేసింది. ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలై 50 రోజులు దాటింది. రష్యన్ బలగాలు ఎంతగా విరుచుకుపడుతున్నా లొంగేదేలేదంటూ ఉక్రెయిన్ జవాబిస్తోంది. రోజుల్లో పూర్తవుతుందనుకున్న టార్గెట్.. వారాలు గడుస్తున్నా పూర్తవకపోవడంతో ఉక్రెయిన్‌తో (Russia Ukraine Crisis) పాటు రష్యా ఆర్మీకి కూడా అపార నష్టం జరుగుతోంది. కీలక నగరం కీవ్ దక్కకుండా మరింత చిక్కుముడిగా మారుతోంది.. ఈ దశలో మరింతగా రెచ్చిపోయిన పుతిన్ సేన.. తూర్పులో రెండో దశ పోరును మొదలు పెట్టిందని జెలెన్‌స్కీ వెల్లడించారు.
తూర్పు ఉక్రెయిన్‌పై పట్టుసాధిస్తే, రాజధాని కీవ్‌ను చుట్టుముట్డడం ఖాయమని భావిస్తోంది రష్యన్ ఆర్మీ. కీవ్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రెమినా పట్టణంపై బాంబింగ్ ఉధృతం చేసింది. చివరకే ఈ పట్టణం స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఖార్కివ్ మీద నాన్‌స్టాప్‌గా క్షిపణులు పడుతున్నాయి. మరియుపొల్‌ను పట్టుకున్నామని రష్యా ఇప్పటికే ప్రకటించినా.. అక్కడ పోరాటం కొనసాగుతూనే ఉంది. ఇక్కడ ఉక్రెయిన్, విదేశీ సైనికులు లొంగిపోవాలని రష్యా హెచ్చరికలు జారీచేసింది.
ఇక ఉక్రెయిన్ రెబెల్స్‌కు గట్టి పట్టున్న దోనెస్త్క్ ప్రాంతంలో జెలెన్ స్కీ బలగాలు బాంబుల మోత మోగిస్తున్నాయి. ఈ ప్రాంతంలో రష్యా దళాలు తిష్టవేసిన ఒక భవంతిపై ఉక్రెయిన్ బలగాలు క్షిపణి దాడులు చేశాయి. మరోవైపు ఉక్రెయిన్‌కి అమెరికా, దాని మిత్రపక్షాలు ఆయుధాలు అందిస్తున్నాయని ఆరోపించారు రష్యా రక్షణమంత్రి సెర్గీ షోయుగు. ఇందుకు ఆ దేశాలు మూల్యం చెల్లించుకుంటాయని హెచ్చరించారు. ఉక్రెయిన్ యుద్ధానికి మూలాలు- అమెరికా, యూరప్ ఆకాంక్షల్లో ఉన్నాయని రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లవరోవ్ ఆరోపించారు.
Also Read: