Ukraine-Russia War: ఇన్నిరోజులు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క.. రష్యా ఎప్పుడూ చవిచూడని ఎదురుదెబ్బ!

Ukraine-Russia War: పుతిన్‌కు అతిపెద్ద దెబ్బే ఇది. తమ రక్షణ వ్యవస్థ విఫలం అయింది. బాంబర్లను వారు కవర్‌ చేయలేదు. యుద్ధ విమానాలను బహిరంగంగా ఉంచడం వల్ల శాటిలైట్లకు దొరికిపోయింది. ఉక్రెయిన్‌ చేసిన దాడి రష్యా మర్చిపోలేకపోతోంది. నాలుగు ఎయిర్‌బేస్‌తోపాటు.. ఒక నేవల్‌ బేస్‌పైనా..

Ukraine-Russia War: ఇన్నిరోజులు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క.. రష్యా ఎప్పుడూ చవిచూడని ఎదురుదెబ్బ!

Updated on: Jun 02, 2025 | 9:25 PM

ఇన్నిరోజులు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క. ఒక్కొక్కటి కాదు.. ఒకేసారి వందల డ్రోన్లు వదిలారు. రష్యా ఎప్పుడూ చవిచూడని ఎదురుదెబ్బను రుచిచూపించింది ఉక్రెయిన్‌. పుతిన్‌ తమదే పైచేయి అనుకుంటున్న సమయంలో.. ఈ సర్‌ప్రైజ్‌ ఎటాక్‌ ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఉక్రెయిన్‌ పకడ్బందీ ప్లాన్‌ చేసింది.. రష్యాకు చెందిన 4 ఎయిర్‌బేస్‌లపై దాడి జరిపింది. మొత్తం డ్రోన్లనే ఉపయోగించిన ఈ దాడులకు దిగింది ఉక్రెయిన్‌. రష్యాలో నాలుగు ఎయిర్‌బేస్‌లపై జరిగిన ఈ దాడిలో ఫైటర్‌ జెట్లు, బాంబర్‌ విమానాలు ధ్వసమయ్యాయి. బెలాయా ఎయిర్‌ బేస్‌, ఇవానోవో ఎయిర్‌ బేస్‌, ఒలీనియా ఎయిర్‌ బేస్‌, దగిలేవో ఎయిర్‌బేస్‌లపై దాడులు చేసింది ఉక్రెయిన్‌. ఈ దాడిలో A -50 బాంబర్‌ విమానాలు ధ్వంసం అయ్యాయి. వాటితోపాటు.. Tu-95 బాంబర్‌ జెట్స్‌, Tu-22 యుద్ధ విమానాలు కూడా తగలబడిపోయాయి. ఆపరేషన్‌ వెబ్‌తో పేరుతో రష్యాని దహనం చేసింది ఉక్రెయిన్‌. ఈ దాడిని ఆ దేశం ఎలా చేసింది? రష్యాలోని కీలక వైమానిక స్థావరాన్ని ఎలా టార్గెట్‌ చేశారనేదే ఆశ్చర్యకరంగా మారింది. కంటైనర్లలో డ్రోన్లను దాచిపెట్టి రష్యాలోకి పంపించారు. ట్రక్కు ద్వారా రష్యాలోకి ప్రవేశించాయి ఈ డ్రోన్లు. అయితే ఈ ట్రక్కు ఎక్కడి నుంచి ఎటు వెళ్లింది..? ఎవరి హయాంలో జరిగింది అనే దానిపై ఆరాతీస్తున్నారు. ఈ ట్రక్కు నుంచే 117 డ్రోన్ల ప్రయోగం జరిగింది. అంతా రిమోట్‌తో ఆపరేట్‌ చేశారు. డ్రోన్లు డైరెక్టుగా వెళ్లి టార్గెట్లపై పడడంతో...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి