
ఒకవైపు ఇంధన కొరత.. మరోవైపు ఆర్థి వ్యవస్థ పతనం బ్రిటన్ సహా యూరోప్ దేశాను సంక్షోభంలోకి నెట్టాయి. పెరగుతున్న ధరలను తట్టుకోలేకపోతున్నారు అక్కడి జనం. ఈ ఏడాది యునైటెడ్ కింగ్‌డమ్ అత్యంత దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటోంది. కరోనా మహమ్మారి సంక్షోభం తర్వాత బ్రిటన్‌లో ద్రవ్యోల్భణం గత 40 ఏళ్ల రికార్డులను తిరగరాసింది. తాజాగా సెప్టెంబర్ నాటికి బ్రిటన్ ప్రభుత్వ లెక్కల ప్రకారం 10.1 శాతానికి చేరుకుంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి యూరోప్‌కు సరఫరా అయ్యే చమురులో కోత పడింది. దీంతో ఇతర ఈయూ దేశాలతో పాటు బ్రిటన్‌లో ఇంధన ధరలు పెరిగిపోయాయి. దీని ప్రభావం ఇతర రంగాల మీద కూడా పడింది.
నానాటికీ దిగజారుతూ వస్తున్న బ్రిటన్ ఆర్థిక వ్యవస్థపై ప్రధాని లిజ్ ట్రస్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు మరింత భారంగా మార్చాయి. తాజాగా ‘విచ్’ అనే వినియోగదారుల సంస్థ చేసిన సర్వే ప్రకారం బ్రిటన్‌లో లక్షలాది మంది తమ జీవనవ్యయ సంక్షోభాన్ని తగ్గించుకునే దిశగా భోజనాన్ని దాటవేస్తున్నారు. సగానికిపైగా ఇళ్లలో ఒక్కపూట భోజనానికి దూరమయ్యారు. ప్రతి ఐదు కుటుంబాల్లో ఒక కుటుంబం ఆహార కొరత సమస్యను ఎదుర్కొంటోంది. 80 శాతం బ్రిటన్ వాసులు హెల్తీ మీల్స్‌కు దూరంగా ఉన్నారని విచ్ సర్వే చెబుతోంది.
ఈ ఏడాది ఆరంభం నుంచీ బ్రిటన్‌లో ఆహార సంక్షోభం కనిపిస్తోంది. అయితే సెప్టెంబరు నాటికి 18 శాతం కుటుంబాలు తమ ఆహార వినియోగాన్ని తగ్గించుకోవలసిన తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయి. బ్రిటన్ ప్రజలు విద్యుత్, ఇంధనం విషయంలో కూడా పొదుపు పాటిస్తున్నారు. మరోవైపు యూరోప్‌లోని ఇతర దేశాలు కూడా దాదాపు ఆర్థిక మాంద్య పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. జీవన వ్యయ సంక్షోభంతో ప్రజలు ఖర్చులను తగ్గించుకోవడంతో దీని ప్రభావం మార్కట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..