Uber: డ్రైవర్లను కార్మికులిగా గుర్తించాల్సిందే.. ఉబర్‌కు స్పష్టం చేసిన కోర్టు.. ఇకపై వీరికి కనీస జీతం..

UBER Drivers Are To Get Minimum Wage: ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకున్న క్యాబ్‌ షేరింగ్‌ కంపెనీ ఉబర్‌కు ఎదురుదెబ్బ తలిగింది. ఇప్పటి వరకు ఉబర్‌లో పనిచేసే డ్రైవర్లకు...

Uber: డ్రైవర్లను కార్మికులిగా గుర్తించాల్సిందే.. ఉబర్‌కు స్పష్టం చేసిన కోర్టు.. ఇకపై వీరికి కనీస జీతం..

Updated on: Feb 20, 2021 | 1:56 PM

UBER Drivers Are To Get Minimum Wage: ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదించుకున్న క్యాబ్‌ షేరింగ్‌ కంపెనీ ఉబర్‌కు ఎదురుదెబ్బ తలిగింది. ఇప్పటి వరకు ఉబర్‌లో పనిచేసే డ్రైవర్లకు కార్మికులుగా గుర్తింపులేని విషయం తెలిసిందే. వీరిని ఉబర్‌ స్వయం ఉపాధి పొందుతున్న ఇండిపెండెంట్‌ థార్డ్‌ పార్టీ కాంట్రాక్టర్లుగా వర్గీకరించింది. అయితే తాజాగా ఈ నిర్ణయంపై బ్రిటన్‌ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
ఇకపై ఉబర్‌ డ్రైవర్లను కార్మికులుగా పరిగణించి వారికి కనీస వేతనం, సెలవు, అనారోగ్యానికి సంబంధించి సిక్‌ పే హక్కులు కల్పించాలని తీర్పునిచ్చింది. ఇప్పటి వరకు ఉన్న చట్టం ప్రకారం థార్డ్‌ పార్టీ కాంట్రాక్టర్లకు కొన్ని హక్కులు మాత్రమే లభిస్తాయి. దీనిపై బ్రిటన్‌కు చెందిన కొందరు డ్రైవర్లు న్యాయపోరాటం చేశారు. డ్రైవర్లను స్వయం ఉపాధి కార్మికులుగానే గుర్తించాలన్న ఉబర్‌ విజ్ఞప్తిని న్యాయమూర్తి జార్జ్ లెగ్గట్ తోసిపుచ్చారు. డ్రైవింగ్‌కు సంబంధించి యాప్‌ లాగ్‌ ఆన్‌ అయిన సమయం నుంచి లాగ్‌ అవుట్‌ అయ్యే వరకు తన డ్రైవర్లను ఉబర్‌ ‘కార్మికులుగానే’ పరిగణించాలని లండన్ సుప్రీం కోర్టు పేర్కొంది. ఇక విషయమై స్పందించిన ఉబర్‌ కోర్టు తీర్పును పాటిస్తామని తెలపడం గమనార్హం. మరి ఈ వాదన బ్రిటన్‌తోనే ఆగిపోతుందా.? ఇతర దేశాలకు పాకుతుందో చూడాలి.

Also Read: ‘సరదాగా చూసిన ఫిక్షన్‌ ఎపిసోడ్‌లు ఖగోళ శాస్ర్తవేత్తను చేశాయి’.. భారత ఖ్యాతిని అగ్రరాజ్యంలో చాటిన స్వాతి లైఫ్‌ స్టోరీ..