జర్మనీలో జరిగిన DFB-పోకల్ కప్ ఫైనల్‌లో పాల్గొన్న TV9 నెట్‌వర్క్ MD & CEO బరున్ దాస్..

భారతదేశంలోని అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ అయిన TV9 నెట్‌వర్క్, మే 25న బెర్లిన్‌లో జర్మనీలో 2024లో అతిపెద్ద క్రీడా ప్రదర్శన నిర్వహించింది. DFB-పోకల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కర్టెన్-రైజర్‌లో మూడు ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ సంస్థ ఎండీ, సీఈవో బరున్ దాస్ బ్రాడ్‌కాస్టర్  ఫ్లాగ్‌షిప్ థాట్-లీడర్‌షిప్ సమ్మిట్ లో పాల్గొన్నారు.  TV9 వాట్ ఇండియా థింక్స్ టుడే (WITT) అంతర్జాతీయంగా జరుగుతోందని తెలిపారు. జర్మనీతో ప్రారంభించి, ఈ సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్‌లలో ఒక శిఖరాగ్ర సమావేశం ప్లాన్ చేయనున్నట్లు ప్రకటించారు.

జర్మనీలో జరిగిన DFB-పోకల్ కప్ ఫైనల్‌లో పాల్గొన్న TV9 నెట్‌వర్క్ MD & CEO బరున్ దాస్..
TV9 Network MD & CEO Mr Barun Das

Edited By: Ravi Kiran

Updated on: May 30, 2024 | 8:15 AM

భారతదేశంలోని అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ అయిన TV9 నెట్‌వర్క్, మే 25న బెర్లిన్‌లో జర్మనీలో 2024లో అతిపెద్ద క్రీడా ప్రదర్శన నిర్వహించింది. DFB-పోకల్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కర్టెన్-రైజర్‌లో మూడు ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ సంస్థ ఎండీ, సీఈవో బరున్ దాస్ బ్రాడ్‌కాస్టర్  ఫ్లాగ్‌షిప్ థాట్-లీడర్‌షిప్ సమ్మిట్ లో పాల్గొన్నారు.  TV9 వాట్ ఇండియా థింక్స్ టుడే (WITT) అంతర్జాతీయంగా జరుగుతోందని తెలిపారు. జర్మనీతో ప్రారంభించి, ఈ సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్‌లలో ఒక శిఖరాగ్ర సమావేశం ప్లాన్ చేయనున్నట్లు ప్రకటించారు. మిస్టర్ దాస్ ఫుట్‌బాల్ చుట్టూ రెండు ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఒకటి ఇండియన్ టైగర్స్ & టైగ్రెస్ గా పేర్కొన్నారు. 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న అబ్బాయిలు, బాలికల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఫుట్‌బాల్ టాలెంట్ ఆటను ప్రారంభించినట్లు తెలిపారు. తమ క్రీడా ప్రతిభను చాటి చెప్పేందుకు ఇది అరుదై వేదికగా తెలిపారు.

ప్రత్యేక కర్టెన్ రైజర్‌ కార్యక్రమానికి గౌరవ అతిథిగా జర్మనీలోని భారత రాయబారి హిస్ ఎక్సలెన్సీ పర్వతనేని హరీష్ హాజరయ్యారు.  జర్మన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (DFB) అధ్యక్షుడు గెర్హార్డ్ రీడ్ల్, ఆస్ట్రియాలోని ఇండియా ఫుట్‌బాల్ సెంటర్ వ్యవస్థాపకుడితో పాటు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బరున్ దాన్ కొన్ని విషయాలను తెలిపారు. “అండర్-14 బాలురు, బాలికల కోసం ఫుట్‌బాల్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద టాలెంట్ వేదికగా ఇది నిలిచిందని తెలిపారు. భారతదేశపు టైగర్స్ & టైగ్రెస్‌లను టీవీ9 డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఫుట్‌బాల్9ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. అందులోనూ జర్మనీలో అతిపెద్ద క్రీడా ఈవెంట్‌గా ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

Tv9 Network Md & Ceo Mr Barun Das

జర్మనీలోని భారత రాయబారి హిస్ ఎక్సలెన్సీ పర్వతనేని హరీష్ మాట్లాడుతూ.. “భారత్- జర్మనీ ఇప్పటికే వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్నాయన్నారు. జర్మనీ, ఐరోపాలో భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్యం ఉందని గుర్తు  చేశారు. కానీ జర్మనీలో నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత కారణంగా ద్వైపాక్షిక వాణిజ్యం, సాంకేతికత ప్రతిభను భారతదేశానికి చెందిన విద్యార్థులచేత పెంపొందిస్తున్నట్లు తెలిపారు. రెండు దేశాలను మరింత దగ్గర చేసేందుకు టీవీ9 చేస్తున్న కార్యక్రమాలు ఇరుదేశాలకు ఎంతగానో దోహదపడతాయన్నారు. అందుకు తాను సంతోషిస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

2022 నుండి DFB ప్రెసిడెంట్‌ కూడా తన భావనను పంచుకున్నారు. భారతదేశంలో DFB-పోకల్‌ని ప్రోత్సహించడాన్ని తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రీడా స్పూర్తి ద్వారా యువ బాలలు,  బాలికలలో ఫుట్‌బాల్ ప్రతిభను పెంపొందించడంలో సహాయ పడుతుందన్నారు. భారతదేశపు అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్‌తో అయిన టీవీ9  DFB కు సహకరించడం ఒక విశేషంగా కీర్తించారు. జర్మనీలో జరిగే ముఖ్యమైన TV9 WITT ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశానికి తమ పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..