TV9 Exclusive Video: టర్కీలో మహా విలయాన్ని కళ్లకు కడుతోన్న షాకింగ్ వీడియో..

|

Feb 14, 2023 | 1:15 PM

టర్కీ, సిరియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా హృదయవిదారకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. చరిత్రలో కనివినీ ఎరగని భూకంపానికి ప్రజలు తల్లడిల్లున్నారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయ బృందాలు రెస్కూ ఆపరేషన్స్‌ను కొనసాగిస్తూనే ఉన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు...

టర్కీ, సిరియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా హృదయవిదారకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. చరిత్రలో కనివినీ ఎరగని భూకంపానికి ప్రజలు తల్లడిల్లున్నారు. వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. సహాయ బృందాలు రెస్కూ ఆపరేషన్స్‌ను కొనసాగిస్తూనే ఉన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే భూకంప ప్రళయానికి సంబంధించిన ఫొటోలు వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతూనే ఉన్నాయి. టర్కీ నుంచి టీవీ ప్రత్యేకంగా రిపోర్టింగ్ చేసింది. భూకంపం ధాటికి అతలాకుతలమైన టర్కీలో ప్రస్తుతం పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించింది.

ఈ క్రమంలోనే భూకంపం ఎంతటి ప్రళయాన్ని సృష్టించిందో చాటి చెప్పే ఓ వీడియో టీవీ9కి ఎక్స్‌క్లూజివ్‌గా లభించింది. భూమి రెండుగా చీలి పోయిన దృశ్యాలు టర్కీలో భూకంప స్థాయి ఏ తీవ్రతలో వచ్చిందో చెబుతోంది. భూకంపం ధాటికి భూమి బద్దలైపోయింది. నిట్టనిలువునా చీలిపోయి అతిభారీ అగాధం ఏర్పడింది. ఏకంగా అరకిలోమీటరు మేర ఏకంగా 100 అడుగుల గొయ్యి పడింది. ప్రకృతి ప్రకోపం టర్కీపై ఎంతలా ఉందో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే.

టర్కీకి నైరుతి ప్రాంతంలో సరియా సరిహద్దులను ఆనుకుని ఉన్న రాష్ట్రం హతయ్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ఆలివ్‌ పంట పండించే వ్యవసాయ క్షేత్రంలో భూమి రెండుగా చీలిపోయింది. భూకంపం వచ్చిన సమయంలో భూమి ఇక్కడ ఇలా చీలిపోయిందని, ఆ సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు వచ్చాయని స్థానికులు తెలిపారు. ఈ ఒక్క ప్రాంతంలోనే కాకుండా చాలా చోట్ల హైవేలపై ఇలాంటి పగుళ్లు కనిపించాయి.

టర్కీ నుంచి టీవీ9 రిపోర్టింగ్‌..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..