టర్కీకి భారత్‌ రిటర్న్‌ గిఫ్ట్‌ సిద్ధమవుతోందా..? సినిమా షూటింగ్స్‌ బంద్‌ చేయాలంటూ..

పాకిస్థాన్‌కు టర్కీ మద్దతు నేపథ్యంలో భారతదేశంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పండ్ల దిగుమతులను నిలిపివేస్తున్నారు, బహిష్కరణ ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు, FWICE భారతీయ చిత్ర నిర్మాతలను టర్కీలో షూటింగ్‌లు నిలిపివేయాలని కోరింది. ఈ నిర్ణయం టర్కీ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

టర్కీకి భారత్‌ రిటర్న్‌ గిఫ్ట్‌ సిద్ధమవుతోందా..? సినిమా షూటింగ్స్‌ బంద్‌ చేయాలంటూ..
Turkey

Updated on: May 14, 2025 | 6:54 PM

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో టర్కీ(తుర్కియో) పాక్‌కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారతీయులను టర్కీపై తీవ్ర వ్యతిరేక వ్యక్తం అవుతోంది. ఇప్పటికే కొంతమంది పండ్ల వ్యాపారులు టర్కీ యాపిల్స్‌ను దిగుమతి చేసుకోవడానికి నిరాకరించారు. బాయ్‌ కాట్‌ టర్కీ అనే క్యాంపెయిన్‌ కూడా రన్‌ అవుతోంది. ఈ నేపథ్యంలో టర్కీకి మరో ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తున్న టర్కీలో భారతీయ సినీ నిర్మాతలు షూటింగ్స్‌ పెట్టుకోవద్దని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) అన్ని భారతీయ చిత్ర నిర్మాతలను కోరింది.

భారత మీడియా, వినోద పరిశ్రమలోని 36 మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు, కళాకారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న అత్యున్నత సంస్థ బుధవారం ఈ అభ్యర్థన చేసింది. టర్కీ పాకిస్తాన్‌కు డ్రోన్‌లు సహా ఆయుధ వ్యవస్థలను అందించడంపై భారత ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా దిల్ ధడక్నే దో, గురు, కోడ్ నేమ్: తిరంగ, రేస్ 2, అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ వంటి అనేక భారతీయ చిత్రాలు టర్కీలో షూటింగ్స్‌ జరుపుకున్నాయ. మన తెలుగు సినిమాల్లో మహేస్‌ బాబు దూకుడు కూడా టర్కీలో షూటింగ్‌ జరుపుకుంది.

అంతేకాకుండా, అనేక టర్కిష్ షోలు, నటులకు ఇండియాలో భారీ ఫ్యాన్‌ బేస్‌ ఉంది. అయితే, పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత కూడా టర్కీ బహిరంగంగా పాకిస్తాన్ వైపు మొగ్గు చూపడంతో టర్కీపై ఇండియాలో వ్యతిరేకత మొదలైంది. సినిమా నిర్మాణాల కోసం టర్కీని ఎంపిక చేసుకోవద్దని నిర్మాతలను FWICE కోరడం కూడా ఆ దేశానికి దెబ్బగా చెప్పకోవచ్చు. సినిమా షూటింగ్స్ వల్ల టర్కీకి మంచి ఆదాయం వస్తోంది. ఇప్పుడా ఆ ఆదాయానికి గండి పడే సూచనలు కనిపిస్తున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి