Viral News: ఫ్రీ టాయిలెట్.. ఫ్రీ లిఫ్ట్.. ఫ్రీ పవర్.. ఇవి ఎన్నిలక హామీలనుకుంటే పొరపాటే!
సాధారణంగా ఏ సంస్థ అయినా ఉద్యోగ ప్రకటన ఇచ్చినప్పుడు ఉద్యాగాల వివరాలు క్వాలిఫికేషన్స్‌తో పాటు జీతభత్యాలు ప్రకటిస్తుంటాయి. ఇంకా కొన్ని కంపెనీలు ఒక అడుగు ముందుకేసి నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు పలు రకాల అదనపు అలవెన్స్‌లు కూడా ఇస్తామని తమ ప్రకటనలో వెల్లడిస్తుంటాయి. కానీ చైనాలో...

సాధారణంగా ఏ సంస్థ అయినా ఉద్యోగ ప్రకటన ఇచ్చినప్పుడు ఉద్యాగాల వివరాలు క్వాలిఫికేషన్స్‌తో పాటు జీతభత్యాలు ప్రకటిస్తుంటాయి. ఇంకా కొన్ని కంపెనీలు ఒక అడుగు ముందుకేసి నిరుద్యోగులను ఆకట్టుకునేందుకు పలు రకాల అదనపు అలవెన్స్‌లు కూడా ఇస్తామని తమ ప్రకటనలో వెల్లడిస్తుంటాయి. కానీ చైనాలో ఒక ఉద్యోగ ప్రకటన చూసిన వారంతా ముక్కు మీద వేలేసుకుని ఇలా కూడా ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారు. ఆ ఉద్యోగ ప్రకటన ఇప్పుడు నెటిట్టం వైరల్‌గా మారింది. ఆ ప్రకటన కాంట్రవర్సీతో పాటు వినోదాన్ని పంచేలా ఉంది.
సోషల్ మీడియాలో షేర్ చేయబడిన ఈ ప్రకటనలో “ఉచిత టాయిలెట్ వినియోగం,” “ఉచిత లిఫ్ట్ యాక్సెస్,” మరియు “ఓవర్ టైం విద్యుత్ ఛార్జీలు లేవు” అనేవి ఉద్యోగులకు ఇచ్చే అలవెన్స్‌ల జాబితాలో రూపొందించారు. ఈ ప్రకటన చూసిన నెటిజన్స్ తెగ నవ్వుకుంటున్నారు. ఏప్రిల్ 29న పోస్ట్ చేసిన ఈ ప్రకటనలో కంపెనీ ఉద్యోగ శీర్షికను బహిర్గతం చేయలేదు. ఉద్యోగం కోరుకునేవారు పలు రకాల క్వాలిఫికేషన్స్ కలిగి ఉండాలని ప్రకటించింది.
ఈ ఉద్యోగం రెండు షిఫ్ట్‌లలో ఎనిమిది గంటల పని దినంతో కూడుకుటుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ముందస్తు షిఫ్ట్ లేదా మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 10 గంటల వరకు ఆలస్యంగా పని, రెండింటిలోనూ ఒక గంట విరామం ఉంటుంది. ప్రొబేషనరీ కాలంలో నెలవారీ జీతం 4,000 యువాన్లు (US$550). ఉద్యోగులు నెలకు నాలుగు రోజులు సెలవులు పొందుతారు మరియు జాతీయ సెలవు దినాలలో రెట్టింపు జీతం పొందుతారు.
