టర్కీ జరిగిన పెను ప్రమాదం విషాద దృశ్యాలు గగుర్పాటుకు గురిచేస్తున్నాయి. ఎటు చూసినా శవాల దిబ్బలు, శిథిలాల కుప్పలు. ఏ బిల్డింగ్ కింద ఎవరు ఇరుక్కొని ఉన్నారో అన్న అనుమానాలు. ఆపదలో ఉన్న వారిని రక్షించేందుకు రెస్క్యూ టీమ్స్ చెమటోడ్చుతున్నాయి. టర్కీ , సిరియాల్లో సంభవించిన భూకంపాలతో ఇప్పటి వరకూ 7,800 మందికి పైగా మరణించారు. భవన శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నవారిని బయటకు తీయడానికి రెస్క్యూ సిబ్బంది చలితో పోరాడుతూ నిరంతరం శ్రమిస్తోంది. అంతేకాదు మరోవైపు వెచ్చదనం కోసం వీధుల్లోని చెత్తను పోగు చేసి చలిమంటలు వేస్తున్నారు.
అయితే, సిరియాలో శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడిన పసిబిడ్డ.. కళ్లు కూడా తెరవకముందే తల్లిని కోల్పోయింది పసికందు. సేవ్ మీ సేవ్ మీ అన్న నినాదాలు చెవిన పడటంతో రెస్క్యూ టీమ్ అలర్ట్ అయింది. గత రెండు రోజులుగా టర్కీలో భూకంపాలు వస్తూనే ఉన్నాయి. ఇంకెన్ని ప్రమాదాలో అని జనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాలం వెళ్లదీస్తున్నారు.
టర్కిష్ లో ప్రధాన నగరాలైన గాజియాంటెప్ , కహ్రామన్‌మరాస్ మధ్య భూకంప కేంద్రానికి సమీపంలో భూకంపం సృష్టించిన భారీ విధ్వంసంతో భవనాలు కూలిపోయాయి. ఈ విధ్వంసం టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ 10 ఆగ్నేయ ప్రావిన్సులలో మూడు నెలల అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
గడ్డకట్టేస్తున్న పిల్లలు:
యునైటెడ్ స్టేట్స్, చైనా, గల్ఫ్ స్టేట్స్‌తో సహా అనేక దేశాలు సహాయం చేయడానికి ముందుకొచ్చాయి. రెస్క్యూ బృందాలను, సహాయక సామాగ్రిని బాధిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. శీతలగాలులతో గత రెండు రోజులుగా అక్కడ పిల్లలు చలికి వణికిపోతున్నారు. ప్రస్తుతం అక్కడ వాతావరణ పరిస్థితి అనుకూలంగా లేనట్లు తెలుస్తోంది. ఓ వైపు భూకంపంతో దెబ్బ తిన్న ప్రాంతాలు.. మరోవైపు శీతల గాలులతో అనుకూలించని వాతావరణంతో ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది.
భూకంప ప్రాంతాల నుంచి రక్షణ కోసం మసీదులు, పాఠశాలలు , బస్ షెల్టర్స్ వంటి ప్రాంతాల్లో చేరుకున్న ప్రజలు చలికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు.. ఈ చలి, మంచు.. శిధిలాల కింద ఉన్న బాధితులకు మరింత ప్రమాదం అని అంటున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రెయేసస్ క్షతగాత్రులకు అవసరమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి మేము WHO అత్యవసర వైద్య బృందాల నెట్‌వర్క్‌ను సక్రియం చేసాము” అని ఆయన చెప్పారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..