Taiwan: కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం… మహమ్మారిపై విజయం సాధించాం… తైవాన్ అధ్యక్షురాలు ఇంగ్ వెన్…

| Edited By:

Jan 02, 2021 | 5:38 AM

కరోనా వైరస్‌ను తమ దేశం సమర్థవంతంగా ఎదుర్కొందని, దానిపై విజయం సాధించిందని తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయ్‌ ఇంగ్‌-వెన్‌ మరోసారి స్పష్టంచేశారు.

Taiwan: కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం... మహమ్మారిపై విజయం సాధించాం... తైవాన్ అధ్యక్షురాలు ఇంగ్ వెన్...
Follow us on

కరోనా వైరస్‌ను తమ దేశం సమర్థవంతంగా ఎదుర్కొందని, దానిపై విజయం సాధించిందని తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయ్‌ ఇంగ్‌-వెన్‌ మరోసారి స్పష్టంచేశారు. నూతన సంవత్సర వేడుకలల్లో భాగంగా ఆమె మాట్లాడారు. ఓవైపు చైనా సైన్యం నుంచి ముప్పు పొంచి ఉన్నప్పటికీ కరోనా వైరస్‌ను సమర్థంగా ఎదుర్కోవడమే కాకుండా ఆర్థికంగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నామని ఇంగ్‌-వెన్‌ పేర్కొన్నారు. పారిశ్రామిక ప్రాజెక్టుల ద్వారా ఉద్యోగ కల్పనతో పాటే రైతులకు పెన్షన్లు, ప్రజలకు ఇళ్ల నిర్మాణం, పటిష్ఠమైన ప్రాథమిక విద్యపై తమ ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోందని ఇంగ్‌-వెన్‌ వెల్లడించారు.

ఆర్థికాభివ‌ృద్ధి…

ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న క్రమంలో తైవాన్‌ జలసంధికి మరోకవైపు సైనిక విమానాలు, యుద్ధనౌకల కార్యకలాపాలతో చైనా బెదిరింపులను పెంచుతోందని ఆరోపించారు. ఇలాంటి పరిణామాలు కేవలం ఇరుదేశాలకే కాకుండా యావత్‌ ప్రపంచానికి ఆందోళన కలిగించే విషయమని అభిప్రాయపడ్డారు. ఎటువంటి లాక్‌డౌన్‌లు, విద్యా, వాణిజ్యాలపై ఎలాంటి ఆంక్షలు లేకుండానే కరోనా మహమ్మారిని ఎదుర్కొన్నామని ప్రకటించారు. డ్రాగన్ కంట్రీకి పక్కనే ఉన్నా తైవాన్‌లో ఇప్పటివరకు కేవలం 800 పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదుకాగా ఏడు మరణాలు సంభవించాయి.

 

Also Read: Covid 19 Vaccine: ఆస్ట్రాజెనెకా అత్యవసర వినియోగానికి ఆమోదం..! భారత బయోటెక్‌పై త్వరలోనే నిర్ణయం…