Trump’s Immigration Crackdown: అన్నంత పని చేసిన పెద్దన్న.. ట్రంప్ దెబ్బకు దేశాలే దడదడ

యూఎస్‌లో స్టూడెంట్‌ ప్రాణం తీసిన డిపోర్టేషన్‌ టెన్షన్..! ఫెడరల్‌ అధికారులు పాస్‌పోర్ట్‌ స్వాధీనం చేసుకోవడంతో న్యూయార్క్‌లో ఒక విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారన్నది బ్రేకింగ్ న్యూస్. మాస్టర్స్‌ కోసం అమెరికా వెళ్లిన అతడు పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నట్టు తనిఖీల్లో గుర్తించారట. అరెస్టు చేస్తారని, బేడీలేసి వెనక్కి పంపుతారని భయపడి పనిచేస్తున్నచోటే ప్రాణం తీసుకున్నాడట. డాలర్ డ్రీమ్స్‌ శకంలో ఇటువంటి కడు విషాదాల్ని చవిచూస్తామని కలలోనైనా ఊహించామా..?

Trumps Immigration Crackdown: అన్నంత పని చేసిన పెద్దన్న.. ట్రంప్ దెబ్బకు దేశాలే దడదడ
Trump's Immigration Crackdown

Edited By: Ravi Kiran

Updated on: Feb 08, 2025 | 6:58 AM

జనవరి 20.. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ కుర్చీనెక్కిన రోజు. వైట్‌హౌస్‌లో రెండోసారి ఎంట్రీ ఇచ్చి రెండున్నరవారాలైనా కాలేదు. క్లైమేట్ ఛేంజ్ నుంచి చమురు తవ్వకాలు, మెడికల్ రిసెర్చ్, ఎల్‌జీబీటీక్యూ.. ఇవాళ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్‌పై ఆంక్షల దాకా.. ఆయన సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు రచ్చ లేపుతున్నాయి. దాదాపు అన్నీ సెక్టార్స్‌నీ కెలికేశాడు. కానీ.. అన్నిటి కంటే తీవ్రంగా ప్రభావితమైన సెక్షన్ మాత్రం ఒక్కటుంది. దాని గురించే ప్రపంచమంతా ఇప్పుడు గుండెలు బాదుకుంటోంది. అధ్యక్షుడిగా తొలి ప్రసంగంలోనే తానేం చేయబోతున్నాడో క్లారిటీ ఇచ్చేశారు ట్రంప్. అమెరికాలో స్వర్ణ యుగం మొదలైందని.. వలసలు, సరిహద్దు భద్రత, పౌరసత్వమే తన ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పినప్పుడే అక్కడుండే లక్షలాది ప్రవాసులకు ఎడమ కన్ను అదిరింది. మైగ్రేషన్ పాలసీని సమూలంగా మార్చిపారేసి.. ఇల్లీగల్ మైగ్రేంట్స్ మీద పగపట్టాడు మన డొనాల్డన్న. ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న ఇండియన్ మైగ్రేంట్లే ట్రంప్ మేస్టారికి ఫస్ట్ టార్గెట్టయ్యారు. అక్రమంగా మా దేశంలో ఉంటున్న మీవాళ్ల సంఖ్య 7 లక్షల 25 వేలు. వీళ్లలో 18 వేల మందిని రౌండప్ చేశాం.. 205 మంది పేర్ల మీద అండర్‌లైన్ చేసుకున్నాం.. మీ దేశానికి పంపించేస్తున్నాం.. ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్.. అని చాటింపు వేసిమరీ పంపించేసింది అమెరికాలో కొత్త గవర్నమెంట్. ఒక్కొక్కరి మీద 4 లక్షలు ఖర్చు పెట్టి.. మిలిటరీ విమానమెక్కించి.. టెక్సస్ నుంచి అమృత్‌సర్‌కి డిపోర్ట్ చేసింది అమెరికా. దీన్ని బట్టే అర్థమౌతోంది.....

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి