Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

USA: మనవాళ్లకు గంటకు 6 డాలర్లు.. అమెరికన్స్‌కు 20 డాలర్లు.. దీంతో.. ఫిర్యాదులు మీద ఫిర్యాదులు

అమెరికాలో మన విద్యార్థులు వణికిపోతున్నారు. నిన్నమొన్నటి వరకూ నాన్‌లోకల్స్‌తో బ్రో అంటూ మింగిల్ అయిన వాళ్లు ఇప్పుడు అదే ఫ్రెండ్ మీద పగబడుతున్నారు. ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌కి ఫిర్యాదు చేస్తున్నారు. ఇలా వస్తున్న కుప్పలు తెప్పల ఫిర్యాదులతో ICE వెబ్‌సైట్‌ పోటెత్తుతోంది..!

USA: మనవాళ్లకు గంటకు 6 డాలర్లు.. అమెరికన్స్‌కు 20 డాలర్లు.. దీంతో.. ఫిర్యాదులు మీద ఫిర్యాదులు
America Police
Follow us
Ram Naramaneni

|

Updated on: Feb 07, 2025 | 6:22 PM

అమెరికాలో ఇమ్మిగ్రేషన్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సైట్‌కి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.  ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటూ ఫిర్యాదు చేస్తున్నారు లోకల్స్‌.  వెబ్‌సైట్‌లో ఇస్తున్న టిప్స్‌తో కాప్స్‌ నిరంతర తనిఖీలు చేపడుతున్నారు.  ICE(ఇమ్మిగ్రేషన్స్ అండ్ కష్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌) నుంచి ఏరోజు నివేదిక ఆరోజే తీసుకుంటుంది వైట్‌హౌస్‌.  టార్గెట్ రీచ్ అవ్వడంలేదని వైట్‌హౌస్ నుంచి ICEపై ఒత్తిడి ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అక్రమవలసదారుల వేటలో 6వేల మంది ICE అధికారులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. కాగా ICE కస్టడీలో 42వేల మంది అక్రమ వలసదారులు ఉన్నట్లు చెబుతున్నారు.

ఈ లెక్కలు వింటేనే మైండ్ బ్లాంక్ అవుతోంది. అవును… ట్రంప్ తగ్గట్లేదు. దేశం మొత్తం మీద 6వేల మంది అధికారులు కేవలం ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వేటలో ఉన్నారు. గురువారం ఒక్కరోజే 8వందల మందిని అరెస్ట్ చేశారు. అసలు ICE వాళ్ల దగ్గర ఉన్నవే 40వేల డిటెన్షన్ బెడ్స్. అంటే ఇలా అదుపులోకి తీసుకున్న వాళ్లను ఉంచడానికి ఇచ్చే బెడ్స్‌. అలాంటిది ఇప్పటికే 42వేలమంది కస్టడీలో ఉన్నారంటే.. అక్రమ వలసదారులను ఎలా కుక్కిపెట్టారో అర్థం చేసుకోవచ్చు.

వైట్‌హౌస్‌ ట్రంప్‌ ఆఫీస్ నుంచి ICE అధికారులపై విపరీతమైన ఒత్తిడి ఉంది. ఈరోజు ఎంతమందిని పట్టుకున్నారు. ఎంతమందిని అరెస్ట్ చేశారు. ఎంతమందిని తిరిగి పంపిస్తున్నారంటూ రిపోర్ట్‌ల మీద రిపోర్ట్‌లు అడుగుతోంది. 42వేల మంది కస్టడీలో ఉన్నారు బాబోయ్ అని చెప్పినా.. మీరు టార్గెట్ రీచ్ అవ్వడంలేదంటూ షంటింగ్ ఇస్తోంది ట్రంప్ ఆఫీస్.

మరో విషయం ఏంటంటే.. అమెరికాలో సూపర్‌మార్కెట్లు, పెట్రోల్ బంక్‌లు, ఫ్యాక్టరీల వంటి వాటిల్లో మనవాళ్లు పనిచేస్తే గంటకు ఆరు డాలర్లు తీసుకుంటారు. అదే పని అమెరికన్ చేస్తే 20 డాలర్లు ఇవ్వాలి. సో.. వారం పదిరోజులుగా మనవాళ్లు కాలు బయటపెట్టాలంటే వణికిపోతున్నారు. సో.. ఆయా షాప్‌ల యజమానులు అనివార్యంగా గంటకు 20 డాలర్లు ఇచ్చి అమెరికన్లనే వాడుకుటున్నారు. ఆ సంపాదనకు రుచిమరిగిన అమెరికన్లు ఇతర దేశీయులపై విపరీతంగా ఫిర్యాదులు చేస్తున్నారు. అక్రమ వలసదారంటూ ముద్ర వేసి వెబ్‌సైట్‌లో పోస్ట్ చేస్తున్నారు. ఇలా వచ్చే టిప్స్‌తో ICE ఇంకాస్త దూకుడుగా వెళ్తోంది. దొరికిన వాళ్లను దొరికినట్లు కస్టడీలోకి తీసుకుంటోంది. ఫలితంగా మనదేశమే కాదు.. అమెరికాలో ఉన్న నాన్‌లోకల్స్ అందరికీ ముచ్చెమటలు పడుతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి