Pakistan: పాకిస్థాన్ ముర్రేలో భారీ మంచు తుఫాన్.. 22 మంది పర్యాటకుల మృతి..

Pakistan Murree: పాకిస్థాన్‌లో ఘరో విషాదం చోటుచేసుకుంది. పాక్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ముర్రేలో 22 మంది పర్యాటకులు

Pakistan: పాకిస్థాన్ ముర్రేలో భారీ మంచు తుఫాన్.. 22 మంది పర్యాటకుల మృతి..
Pakistan

Updated on: Jan 09, 2022 | 11:59 AM

Pakistan Murree: పాకిస్థాన్‌లో ఘరో విషాదం చోటుచేసుకుంది. పాక్‌లోని ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ముర్రేలో 22 మంది పర్యాటకులు మృతిచెందారు. భారీ హిమపాతం కారణంగా పర్యాటకుల వాహనాలు మంచులో కూరుకుపోయాయి. దీంతో పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయాయి. రాత్రంతా భారీ స్థాయిలో మంచు కురవడంతో వాహనాల్లో ఉన్న పర్యాటకులకు ఊపిరి ఆడక మృతి చెందారు. మొత్తం 22 పర్యాటకులు మృతిచెందారని.. వారిలో 9 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన ఇమ్రాన్ ప్రభుత్వం ముర్రేలో అత్యవసర పరిస్థితి విధించి.. సహాయక చర్యలు చేపట్టింది. మంచులో చిక్కుకున్న వాహనాలను బయటకు తీస్తున్నారు.

ముర్రేకు వెళ్లే అన్ని దారులను మూసివేసి.. సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. కాగా .. ఈ ఘటనలో ఇస్లామాబాద్‌కు చెందిన ఓ పోలీసు అధికారి నవీద్ ఇక్బాల్‌తోపాటు ఆయన కుటుంబ సబ్యులు కూడా మరణించినట్లు పేర్కొన్నారు. ఘటనపై ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

పంజాబ్ ప్రావిన్స్‌లోని ఈ పర్యాటక ప్రదేశం ముర్రే ఇస్లామాబాద్‌కు 45.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనిని శీతాకాలంలో సందర్శించేందుకు వేలాదిమంది సందర్శకులు తరలివస్తుంటారు.

Also Read:

PM Narendra Modi: కరోనా థర్డ్ వేవ్‌పై కేంద్రం అలెర్ట్.. నేడు ప్రధాని మోదీ సమీక్ష.. లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం..!

Hyderabad: సండే క‌రోనా వ్యాప్తికి సెల‌వు లేదండి..! ఇంత డ్యామేజ్ జరిగినా అసలు భయమన్నదే లేదుగా..?