Columbia Toxic: చూసేందుకు మంచులా ఎంతో అందంగా కనిపిస్తోంది.. కానీ దాని దుర్వాస భరించలేం.. కొలంబియా రాజధానిని భయంకరమైన నురగ ముంచెత్తింది.. రాజధాని బొగోటా (Bogota) ను ఆనుకొని ప్రహించే నది బొజాకా.. ఈ నది మీద తెల్లటి దూది పింజాన్ని చూసి అందరూ ఆశ్యర్య పోయారు.. అదొక పెద్ద నురగ.. నదిలో భారీగా పొరమాదిరిగా పేరుకుపోయి కొట్టుకు వచ్చిన ఈ నురగ ఒక్కసారిగా నగర వీధులను ముంచెత్తింది. ఎక్కడ చూసినా ఈ ఇదే కనిపించింది. చూడటానికి ఎంతో అందంగా కనిపించినా ఈ నురగ దుర్వాసనను స్థానికులు భరించలేకపోయారు.
బొగోటాకు 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోస్క్వెరా అనే పట్టణం నుంచి ఈ నురగ వచ్చినట్లు గుర్తించారు. బొజాకా నదిలో పారవేసిన రసాయణ పదార్ధాలు, డిటర్జెంట్‌లతో ఈ నురగ ఏర్పడినట్లు చెబుతున్నారు.. ఇన్నీ నదీజలాల్లో కలిసిపోయి, గాలి వీచిన సమయంలో నురగ ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.. ఎప్పటి నుంచే నది ఒడ్డున పేరుకుపోయిన రసాయనాలు వర్షాల కారణంగా నదిలో చేరడంతో ఈ సమస్య ఏర్పడింది.
మోస్క్వెరా పట్టణంలో మురుగునీటి శుద్ధి కర్మాగారం ఉన్నా అది సరిగ్గా పని చేయడంలేదు. దీంతో రసాయనాలు నదిలో కలిసిపోతున్నాయి. కాలుష్యాన్ని తగ్గించేందుకు తీసుకుంటున్న చర్యలు పెద్దగా ఫలించడం లేదని అధికారులు చెబుతున్నారు.
ఈ నురగలో భారీ స్థాయిలో రసాయనాలు ఉన్నా తక్షణ అపాయం ఏమీ లేదంటున్నారు. అయితే ఇది విషపూరితం కావడంతో ప్రజల ఆరోగ్యంపై కచ్చితంగా ఇది ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read: Eyes Care Tips: ఈ సమస్యలు కంటిచూపు కోల్పోయేందుకు కారణం కావచ్చు
KTR: సీఎం జగన్‌ను సోదర సమానుడిగా భావిస్తున్నా.. తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన కేటీఆర్..