పులులు సాధువుగా మారుతాయి.. ప్రతి శనివారం ఈ జూలో ఉపవాసం ఉంటాయి.. ఎందుకంటే

|

Apr 10, 2024 | 11:14 AM

ఇక్కడ పులులను కీపర్లు ఉద్దేశపూర్వకంగా ఒక రోజంతా ఉపవాసం ఉంచుతారు. ఒక రోజు అంతా ఆకలితో ఉంటాయి. జూ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గణేష్ కోయిరాలా చెప్పిన ప్రకారం పులుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రతి శనివారం 'ఉపవాసం' ఉంచుతారు. ఉపవాస సమయంలో జంతువులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పులులను 'ఉపవాసం'ఉంచడం వెనుక కారణం కూడా ఉంది. ముఖ్యంగా పులులు బరువు పెరగకుండా వాటిని రక్షించడానికి, వేగంగా కదిలే విధంగా ఉంచడానికి ఇలా చేస్తామని చెప్పారు. జంతుప్రదర్శనశాలలో ఆడ పులులు ఐదు కిలోల గేదె మాంసం, మగ పులులు రోజుకు 6 కిలోల మాంసాన్ని తింటాయి.

పులులు సాధువుగా మారుతాయి.. ప్రతి శనివారం ఈ జూలో ఉపవాసం ఉంటాయి.. ఎందుకంటే
Tigers Turn 'sadhus
Follow us on

భూమి మీద అత్యంత ప్రమాదకరమైన, క్రూరమైన జీవుల గురించి మాట్లాడితే పులులు మొదటి ఐదు స్థానాల్లో ఒక స్థానాన్ని ఖచ్చితంగా దక్కించుకుంటాయి. ఈ మాంసాహార జంతువులు ఇతర జీవులను చంపడానికి ప్రకృతిచే తయారు చేయబడినవి. పులులు తమ ఎరను వేటాడేటప్పుడు కనికరం చూపవు. పులులు పూర్తిగా మాంసాహారం, జీవించడానికి మాంసంపై ఆధారపడి ఉంటాయి. అయితే జంతు ప్రదర్శనశాలలో ఉండే ఈ మాంసాహార జంతువులు వారానికి ఒకరోజు ఉపవాసం ఉంటాయి. ఆ రోజు మాంసాహారం అస్సలు తినవు. అయితే ఈ మాంసాహార జంతువులు ఎందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నాయి తెలుసుకుందాం..

BBC ప్రకారం నేపాల్ సెంట్రల్ జంతు ప్రదర్శనశాల ఈ నియమాన్ని అనుసరిస్తుంది. ఇక్కడ పులులను కీపర్లు ఉద్దేశపూర్వకంగా ఒక రోజంతా ఉపవాసం ఉంచుతారు. ఒక రోజు అంతా ఆకలితో ఉంటాయి. జూ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గణేష్ కోయిరాలా చెప్పిన ప్రకారం పులుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రతి శనివారం ‘ఉపవాసం’ ఉంచుతారు. ఉపవాస సమయంలో జంతువులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పులులను ‘ఉపవాసం’ఉంచడం వెనుక కారణం కూడా ఉంది. ముఖ్యంగా పులులు బరువు పెరగకుండా వాటిని రక్షించడానికి, వేగంగా కదిలే విధంగా ఉంచడానికి ఇలా చేస్తామని చెప్పారు.

జంతు  ప్రదర్శనశాలలో ఆడ పులులు ఐదు కిలోల గేదె మాంసం, మగ పులులు రోజుకు 6 కిలోల మాంసాన్ని తింటాయి. అయితే శనివారాల్లో జూ కీపర్లు వాటి జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి మాంసాన్ని అందించరు. ఎందుకంటే ఈ జంతువులు బరువు పెరిగా, ఊబకాయంగా మారినా అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి.

ఇవి కూడా చదవండి

అయితే పులులు ఆరోగ్యం కోసం ఔషధాలపై ఆధారపడవచ్చు. ఇలా చేయడం పులుల ఆరోగ్యాన్ని నిర్వహించడం చాలా సులభమైన మార్గంగా అనిపించవచ్చు. అయితే ఇది పులి జీవితాంతం కొనసాగించడం ఉత్తమ మార్గం కాదు. ఇలా చేయడం వలన దీర్ఘకాలిక ఆరోగ్యానికి దారి తీస్తుంది. ఈ నేపధ్యంలో స్థిరత్వం, రొటీన్ ఆహరం మెరుగైన ఆరోగ్య స్థితికి మార్గం సుగమం చేస్తాయి. మాంసాహార జీవులు ఒక రోజు ఉపవాసం చేసిన సమయంలో వాటి ఆరోగ్యంపై విశేషమైన సానుకూల ప్రభావం ఉన్నట్లు నిపుణులు గుర్తించారు.

చెదపురుగుల వంటి చిన్న కీటకాల నుండి పెద్ద ఏనుగుల వరకు పులులు విభిన్నమైన ఆహారం కోసం ప్రసిద్ధి చెందాయి. అయినప్పటికీ కనీసం 20 కిలోల (45 పౌండ్లు) బరువున్న దుప్పి, జింకలు, పందులు, ఆవులు, గుర్రాలు, గేదెలు, మేకలు వంటి పెద్ద జంతువులను తినడం ద్వారా వీటి ప్రాథమిక పోషణ లభిస్తుంది. జూ లోని పులలకు అప్పుడప్పుడు ఆసియా అడవి కుక్కలు, ఎలుగుబంట్లు, టాపిర్లు , ఏనుగులు, ఖడ్గమృగాల పిల్లలతో విందుని ఆనందిస్తారు.

నేపాల్‌లోని సెంట్రల్ జూ జవాలాఖేల్ పరిసరాల్లో ఉంది. ఈ నిలయం ఇప్పటి 969 జంతువులకు నివాసంగా మర్రింది. దాదాపు 09 విభిన్న జాతుల జంతువులూ నివసిస్తున్నాయి. ప్రస్తుతం నేషనల్ ట్రస్ట్ ఫర్ నేచర్ కన్జర్వేషన్ (NTNC)చే నిర్వహించబడుతోంది, 6 హెక్టార్లు లేదా 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ జంతు ప్రదర్శనశాల మొదట ఒక ప్రైవేట్ సంస్థ. తరువాత 1956లో ప్రజల సందర్శనార్ధం తలుపులు తెరచారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..