Afghanistan: అఫ్గాన్ ను కుదిపేస్తున్న వరదలు.. వెయ్యి మంది మృతి.. భారీగా ఆస్తి నష్టం

|

Aug 26, 2022 | 5:43 PM

అఫ్గానిస్థాన్ (Afghanistan) ను భారీ వర్షాలు, వరదలు కుదిపేస్తున్నాయి. వీటి కారణంగా వెయ్యి మంది ప్రజలు మృతి చెందారని స్థానిక అధికారులు వెల్లడించారు. 1500 మందికి పైగా గాయపడ్డార తాలిబన్ ప్రభుత్వం వివరాలు వెల్లడించింది. వర్షాలు...

Afghanistan: అఫ్గాన్ ను కుదిపేస్తున్న వరదలు.. వెయ్యి మంది మృతి.. భారీగా ఆస్తి నష్టం
Floods In Pakistan, Afghani
Follow us on

అఫ్గానిస్థాన్ (Afghanistan) ను భారీ వర్షాలు, వరదలు కుదిపేస్తున్నాయి. వీటి కారణంగా వెయ్యి మంది ప్రజలు మృతి చెందారని స్థానిక అధికారులు వెల్లడించారు. 1500 మందికి పైగా గాయపడ్డార తాలిబన్ ప్రభుత్వం వివరాలు వెల్లడించింది. వర్షాలు, వరదల కారణంగా 30 వేల మంది నిరాశ్రాయులయ్యారని తెలిపింది. ప్రాణనష్టంతో పాటు ఆర్థిక నష్టం కూడా అధికంగా ఉందని ఓ ప్రకటనలో వివరించింది. కాగా.. రుతుపవనాల ప్రభావంతో అఫ్గాన్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు ఉప్పొంగుతుండంటో వరదలు జనావాసాలను ముంచెత్తుతున్నాయి. జూన్ నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక రహదారులు, వంతెనలు కొట్టుకుపోయాయి. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు.. పాకిస్తాన్ (Pakisthan) లోనూ భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అఫ్గానిస్థాన్ సరిహద్దులోని ఖైబర్ పఖ్తుంఖ్వా, తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం కలిగింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.

కాగా.. 2010లో వరదల కారణంగా రెండువేల మంది ప్రాణాలు కోల్పోయారు. 2010 లో పాకిస్తాన్‌లో వరదలు పెను విధ్వంసం సృష్టించాయి. 2 కోట్ల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. 12 లక్షలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. లక్షల హెక్టార్లలో పంటలు నాశనమయ్యాయి. ఆ తర్వాత ఈ ఏడాదే భారీగా వరదలు రావడంతో అధికారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..