Viral Video: ప్రపంచంలో అత్యంత ఎత్తు నుంచి తీసిన వీడియో… చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

|

Oct 01, 2021 | 8:05 PM

కొంతమందికి ఔత్సాహికులకు ప్రపంచంలోని ఎత్తైన ప్రాంతం పైకి వెళ్లడం సరదాగా ఉంటుంది. అందులో ఎవరెస్ట్ పర్వతం ఎక్కడం ఒక కలగా ఉంటుంది....

Viral Video: ప్రపంచంలో అత్యంత ఎత్తు నుంచి తీసిన వీడియో... చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Twitter
Follow us on

కొంతమందికి ఔత్సాహికులకు ప్రపంచంలోని ఎత్తైన ప్రాంతం పైకి వెళ్లడం సరదాగా ఉంటుంది. అందులో ఎవరెస్ట్ పర్వతం ఎక్కడం ఒక కలగా ఉంటుంది. కానీ ఎవరెస్ట్ ఎక్కడం ఆషామాషీ వ్యవహరం కాదు. ఇది ఎక్కడానికి ప్రయత్నించిన కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అయినా భయపడకుండా ఎరెస్ట్ ఎక్కిన వారూ ఉన్నారు. అంత ఎత్తు ఎక్కగానే వారి ఆనందానికి అవధులు ఉండవు. కొందరు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి వీడియోను పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ వ్యక్తి ఎవరెస్ట్ శిఖరంపై నిలబడి గోప్రోతో పరిసరాలను షూట్ చేసి ఆ వీడియోను ట్విట్టర్‎లో పోస్టే చేశాడు. ఈ వీడియో చూస్తే మొదట్లో భయం కలుగుతున్నప్పటికీ మంచుతో కప్పబడిన పర్వత శిఖరాలను చూస్తే ఆహ్లదంగా అనిపిస్తుంది. కొంతమంది శిఖరం చుట్టూ కూర్చోవడం కూడా కనిపిస్తుంది. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ప్రదేశం నుంచి తీసిన ఈ వీడియోను అందురు చూడాల్సిందే.. అతడు వీడియోతో పాటు “ప్రపంచం పై నుండి ఒక దృశ్యం… ఎవరెస్ట్ పర్వతం, ”అని క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియోకు 31,000 వ్యూస్ వచ్చాయి. ఎవరెస్ట్ శిఖరం నుండి కనిపించే అందమైన ప్రకృతి దృశ్యాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. చాలా మంది ఏదో ఒక రోజు ప్రపంచంలోని అత్యున్నత స్థానానికి చేరుకోవాలని తమ కోరిక ఉంటుందని కామెంట్స్ చేశారు.

Read Alo.. Viral Photos: ఈ 14 దేశాల్లో మన రూపాయి యమా కాస్ట్లీ.. తక్కువ ఖర్చుతో విదేశాలకు టూర్ వెళ్లొచ్చు.!