Narendra Modi: ఈ తరానికి కావాల్సింది యుద్ధం కాదు.. రష్యా ప్రధాని పుతిన్‌తో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు..

Narendra Modi: షాంఘై సహకార సహకార సంస్థ సదస్సు (SCO Summit) ఉజ్బెకిస్థాన్‌లో సమర్‌ఖండ్‌లో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ సదస్సులో రష్యా, చైనా అధ్యక్షులతో పాటు భారత్‌, పాకిస్థాన్‌ ప్రధాన మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా..

Narendra Modi: ఈ తరానికి కావాల్సింది యుద్ధం కాదు.. రష్యా ప్రధాని పుతిన్‌తో మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు..
Modi Putin Meeting Ani Twit

Updated on: Sep 16, 2022 | 7:57 PM

Narendra Modi: షాంఘై సహకార సహకార సంస్థ సదస్సు (SCO Summit) ఉజ్బెకిస్థాన్‌లో సమర్‌ఖండ్‌లో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ సదస్సులో రష్యా, చైనా అధ్యక్షులతో పాటు భారత్‌, పాకిస్థాన్‌ ప్రధాన మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా మోదీ, పుతిన్‌ పలు విషయాలపై చర్చించారు. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య నెలకొన్న యుద్ధంపై భారత వైఖరి ఏంటో ప్రధాని మోదీ మరోసారి చెప్పకనే చెప్పారు. గతంలో పుతిన్‌తో మాట్లాడిన వ్యాఖ్యలను సైతం ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘ఈ తరానికి కావాల్సింది యుద్ధం కాదని నేను గతంలో ఫోన్‌లో మీతో చర్చించాను. శాంతి మార్గంలో ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై ఈరోజు నేరుగా మాట్లాడే అవకాశం వచ్చింది. భారత్‌, రష్యాల మధ్య బంధం గత దశాబ్ధాలుగా కొనసాగుతోంది’ అని మోదీ తెలిపారు. ఇక ఈ విషయమై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రతిస్పందిస్తూ.. ‘ఉక్రెయిన్‌ సంఘర్షణపై మీ వైఖరి (మోదీని ఉద్దేశిస్తూ), మీ ఆందోళనల గురించి నాకు తెలుసు. ఈ పరిస్థితి త్వరలోనే ముగింపు పలకాలని మేము కూడా భావిస్తున్నాం. అక్కడ జరుగుతోన్న ప్రతీ సంఘటనను మీకు ఎప్పటికప్పుడు తెలియజేస్తాము’ అని పుతిన్‌ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇక శనివారం (సెప్టెంబ్‌ 17) నరేంద్రమోదీ జన్మదినం విషయమై పుతిన్‌ మాట్లాడుతూ.. ‘మై డియర్‌ ఫ్రెండ్‌. రేపు మీ పుట్టిన రోజు అనే విషయం మాకు తెలుసు. కానీ రష్యా ఆచారం ప్రకారం మేము ముందస్తు శుభాకాంక్షలు తెలియజేయము. కాబట్టి నేను ఇప్పుడు విషెస్‌ చెప్పట్లేదు. కానీ మీకు ఆల్‌ ది బెస్ట్ చెబుతున్నాను. భారత్‌తో రష్యా సంబంధాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము’ అని చెప్పుకొచ్చారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..