Oldest Tree in the World: ప్రపంచంలో ఎన్నో విశేషాలు నిండి ఉన్నాయి. సోషల్ మీడియా విస్తృతితో ఇప్పడు ప్రతి చిన్నవిషయం బహిర్గతమవుతోంది. ప్రపపంచంలో ఏమూలన ఏమున్నా క్షణాల్లో జనాల్లోకి వచ్చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పురాతనమైన, అతి పెద్దదైన చెట్టు గురించి ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ చెట్టు ఎక్కడుంది? ఏంటా వార్త? ఇప్పుడు తెలుసుకుందాం..
కాలిఫోర్నియాలోని సిక్వోయా అండ్ కింగ్స్ కెన్యాన్ నేషనల్ పార్కులో ‘జనరల్ షెర్మాన్’ అనే చెట్టు ప్రపంచంలోనే అతి పే..ద్ద.. చెట్టు ఉంది. ఐతే ప్రస్తుతం ఇది ప్రమాదంలో ఉందట. ఎందుకంటే.. గత నెలలో 9వ తేదీన మెరుపులతో కూడిన గాలివాన కురవగా.. అక్కడి అడవిలో నిప్పురాజుకుంది. అలా పశ్చిమ భాగంలో చాలా వరకు చెట్లు కాలిపోయినట్లు ఓ నివేదికలో వెల్లడించింది. ఐతే ఇప్పుడు 275 అడుగుల ఎత్తున్న జనరల్ షెర్మాన్ చెట్టుకు ఆ మంటలు అంటుకునే ప్రమాదం ఉన్నట్లు ఆ దేశం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అగ్నిమాపక సిబ్బంది దీనిని పరిరక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దాదాపుగా 2,200 యేళ్ల నాటి ఈ చెట్టు ప్రపంచంలోనే అతి పురాతనమైన వృక్షంగా పేరుగాంచింది. కాగా గత యేడాది సంభవించిన కార్చిచ్చులో వేలకొద్ది జనరల్ షెర్మాన్ చెట్లు కాలి బూడిదైపోయాయి. ఇవి కూడా వేల యేళ్లనుంచి ఉన్న అతిప్రాచీన చెట్లే. ఈ అగ్నికీలల వల్ల అడవులకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పర్యావరణ ప్రేమికులు. అమెరికాలోని పశ్చిమ ప్రాంతంలో మంటలను అదుపు చేయడం ప్రస్తుత కాలంలో చాలా కష్టంగా ఉంది. దాదాపు 30 యేళ్ల క్రితం నాటి ఉష్ణోగ్రతతో పోలిస్తే ఇప్పుడు అక్కడ గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఇటీవల అడవుల్లో అగ్నిప్రమాదాలు సంభవించడం పరిపాటైపోయింది.
తాజా సమాచారం ప్రకారం ఈ మంటలు సిక్వోయా నేషనల్ పార్కుకు 1.5 కిలీమీటర్ల దూరంలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ పార్కులో దాదాపుగా రెండువేల చెట్లు ఉన్నాయి. ఈ అగ్నికీలల నుంచి చెట్లను కాపాడటానికి అల్యూమినియం చుట్లతో వీటిని కప్పుతున్నారు. అడవిలో మంటలు మరింత పెరగడానికి కారణమయ్యే చెట్లను తొలగించే పనులను అగ్నిమాపక సిబ్బంది ముమ్మరం చేస్తున్నారు. వాతావరణం వేడెక్కితే సంభవించే పరిణామాలకు నిదర్శనమే కాలిఫోర్నియా కార్చిచ్చు. వీటిని అదుపు చేయలేక, చెట్లను కాపాడుకోలేక అక్కడి ప్రభుత్వం పడుతున్న ఇబ్బందులు ఇతర దేశాలకు భవిష్యత్తు హెచ్చరికలుగా అనిపిస్తున్నాయి.
Also read:
CM Jagan: ప్రధాని గారు.. విద్యుత్ ధరలపై చర్యలు తీసుకోండి.. మోడీకి లేఖ రాసిన సీఎం జగన్..
Navaratri 2021: దుర్గమ్మ మండపంగా దుబాయ్ బుర్జ్ ఖలీఫా టవర్.. చూస్తే అవాక్కవుతారు..