Support to India: ‘స్టే స్ట్రాంగ్ ఇండియా’ అంటూ వెలుగుల సందేశం ఇచ్చిన ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా

|

Apr 26, 2021 | 6:03 PM

కరోనా కల్లోలానికి అంతం కనిపించడం లేదు. భారతదేశం క్రమేపీ కరోనా సంక్షోభానికి తలవంచే పరిస్థితి వచ్చేస్తున్న భయం వెంటాడుతోంది.

Support to India: స్టే స్ట్రాంగ్ ఇండియా అంటూ వెలుగుల సందేశం ఇచ్చిన ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా
Burz Khalifa
Follow us on

Support to India: కరోనా కల్లోలానికి అంతం కనిపించడం లేదు. భారతదేశం క్రమేపీ కరోనా సంక్షోభానికి తలవంచే పరిస్థితి వచ్చేస్తున్న భయం వెంటాడుతోంది. కరోనాను ఎదుర్కోవడంలో వ్యవస్థలోని లోపాలు ఒక్కోటీ బయటపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో భారతావనికి మేమున్నాం అంటూ ప్రపంచ దేశాలు మద్దతు పలుకుతున్నాయి. అవసరమైన సహాయం అందివ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించాయి. అంతేకాదు, కొన్ని దేశాలు ఇప్పటికే భారతదేశం ఎదుర్కుంటున్న అతిపెద్ద సంక్షోభం అయిన ఆక్సిజన్ కొరత నుంచి బయటపడేయటానికి ఆక్సిజన్ పంపించడం మొదలు పెట్టాయి. ఈ నేపధ్యంలో ప్రపంచంలోనే ఎత్తైన భవనం కూడా భారత్ కు మద్దతుగా నిలిచింది.

అవును.. యూఏఈలో ఉన్న ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా ఆదివారం రాత్రి భారతదేశపు మువ్వన్నెలతో మెరిసిపోయింది. భారత్ కు మేమున్నాం అంటూ ఆ దేశం తన బుర్జ్ ఖలీఫా ద్వారా ప్రపంచానికి పెద్ద సందేశం పంపించింది. మూడు రంగుల భారత జెండా.. మధ్యలో అశోక చక్రం వేలుగులీనుతుండగా ”స్టే స్ట్రాంగ్ ఇండియా” అనే సందేశాన్ని లైట్ల వెలుగులతో ప్రదర్శించింది. ఈ ప్రదర్శన కోట్లాది మంది భారతీయులకు ఒక స్ఫూర్తిగా నిలిచింది. కరోనా సవాళ్ళ మధ్య బుర్జ్ ఖలీఫా ప్రదర్శన భారతీయుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది అనడం లో సందేహం లేదు.

ఆ షో మీరూ ఇక్కడ చూడొచ్చు..

బుర్జ్ ఖలీఫా ఈ స్ఫూర్తికి ఇండియా నుంచి దన్యవాదముల సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. వాటిలో కొన్ని ఈ కింద చూడొచ్చు.



సోమవారం ఉదయం 8 గంటలకు ముగిసిన 24 గంటల్లో 3.50 లక్షలకు పైగా కొత్త కోవిడ్ -19 కేసులు ఇండియాలో నమోదయ్యాయి, దేశంలోని మొత్తం కరోనా కేసులు 1.73 కోట్లకు పైగా ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, కేరళ ఈ ఐదు రాష్ట్రాలలోనే 54 శాతం కేసులు నమోదు అయ్యాయి.

Also Read: ఆక్సిజన్ ఉత్పత్తికోసం స్టెరిలైట్ ప్లాంట్ పునరుద్ధరణకు తమిళనాడు ప్రభుత్వ అనుమతి

US Army: నూరేళ్ళ అమెరికా ఆర్మీలో కఠినమైన శిక్షణ పూర్తి చేసి చరిత్ర సృష్టించిన మహిళా సైనికులు!