ప్రజలు వారే, ప్రభువులు వారే.. మగవారు లేని మహిళా రాజ్యం… ఇదెక్కడో తెలుసా..?

|

Mar 08, 2021 | 12:36 PM

మార్చి ఎనిమిదిన మనమంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటామన్న విషయం తెలిసిందే! ఈ సందర్భంగా మహిళలకు సంబంధించి ఓ విశేష కథనాన్ని చూద్దాం..

ప్రజలు వారే, ప్రభువులు వారే.. మగవారు లేని మహిళా రాజ్యం... ఇదెక్కడో తెలుసా..?
Follow us on

The kingdom of women : మార్చి ఎనిమిదిన మనమంతా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటామన్న విషయం తెలిసిందే! ఈ సందర్భంగా మహిళలకు సంబంధించి ఓ విశేష కథనాన్ని చూద్దాం.. వాటికన్‌ సిటీలో ఆడవాళ్లు ఉండరు.. అక్కడంతా మగవాళ్లదే రాజ్యం! ఆ మాటకొస్తే సగభాగం ఆడవాళ్లు ఉన్న చోట కూడా మగవాళ్లదే కదా పెత్తనం! ఈ సంగతి అటుంచితే.. వాటికన్‌ సిటీకి కంప్లీట్‌గా రివర్స్‌ చైనాలోని సెరెనె వ్యాలీ! హిమాలయాల్లో ఉన్న ఆ వ్యాలీలో మొసో పేరుతో ఓ గిరిజన తెగ ఉంది.. అక్కడంతా మహిళలే! మగవాళ్లు లేరు కాబట్టే సంతోషంగా.. ఆనందంగా నివసిస్తున్నారు వారంతా.

మొసో మహిళలు పెళ్లిళ్లు అస్సలు చేసుకోరు.. వారి జీవితాల్లోకి ఛస్తే పురుషులను రానివ్వరు.. రానిస్తే జీవితాంతం చస్తూ బతకాల్సి వస్తుందని కాబోలు అంత గట్టి నిర్ణయం తీసుకున్నారు.. లుగు అనే చెరువు చుట్టుపక్కల ఉన్నదంతా మొసో మహిళల రాజ్యమే! అక్కడ ఎవరి అధికారాలూ పని చేయవు.. మొసో మహిళలు తమ నిర్ణయాలను తామే తీసుకుంటారు.. అందరూ కలిసి ఓ సొసైటీగా ఏర్పడ్డారు.. తమ సమాజంలో ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా అందరూ సాయపడతారు.. అందుకే వారికి ఏ కష్టమూ ఉండదు..

పెళ్లికి దూరంగా ఉండాలన్న కఠిన నిర్ణయం వీరెందుకు తీసుకున్నారబ్బా అనే క్వొశ్చన్‌ రాకుండా ఎలా ఉంటుంది..? దానికో ఆన్సర్‌ ఉంది.. అప్పుడెప్పుడే ఈ తెగకు చెందిన ఓ పదమూడేళ్ల అమ్మాయి పెళ్లి చేసుకుని నానా కష్టాలు పడిందట! చివరకు విడాకులు తీసుకుంటే కానీ కష్టాల నుంచి ఆమె బయటపడలేదట! అంతే అప్పట్నుంచి ఈ తెగవారికి పెళ్లంటేనే అసహ్యమేసింది.. సంతానం కోసం పేదవాళ్లు ఎవరైనా ఆడపిల్లలను ఇస్తే సొంత బిడ్డలా సాకుతారు. వారినే తమ పిల్లలుగా భావిస్తారు.. వాళ్ల బరువు బాధ్యతలన్నీ చూసుకుంటారు..

ఇదీ చదవండిః  viral pic : పెళ్లి వేడుకలో వరుడికి షాక్ ఇచ్చిన వధువు తండ్రి.. కానుకగా ఇచ్చిందేమిటంటే..!