Viral Video: వరదల్లో చిక్కుకుపోయిన వీధి కుక్క.. ప్రాణాలకు తెగించి కాపాడిన రియల్ హీరోలు

Thailand Floods: థాయ్‌లాండ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.

Viral Video: వరదల్లో చిక్కుకుపోయిన వీధి కుక్క.. ప్రాణాలకు తెగించి కాపాడిన రియల్ హీరోలు
Thailand Floods
Follow us
Janardhan Veluru

|

Updated on: Sep 29, 2021 | 2:52 PM

Thailand Floods: థాయ్‌లాండ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. వంకలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆ దేశంలో దాదాపు మూడోవంతు ప్రాంతాలు వరదల్లో మగ్గుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందగా.. ఇద్దరు గల్లంతయ్యారు. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.  మరికొన్ని రోజులు భారీ వర్షాలు కొనసాగవచ్చన్న వాతావరణ శాఖ హెచ్చరికలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. వరద పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆదేశించారు.

ఉత్తర థాయ్‌లాండ్‌లో వరదల్లో కొట్టుకుపోతున్న ఓ వీధి కుక్కను స్థానికులు రక్షించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇతరుల సాయంతో ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి మరీ ఆ కుక్కను వరదనీటి నుంచి బయటకు తీశాడు. వీరు చూపిన తెగువను నెటిజన్లు అభినందిస్తున్నారు. రియల్ హీరోస్ అంటూ ప్రశంసల జల్లుకురిపిస్తున్నారు.

ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో పలుచోట్ల జలాశయాలు తెగిపోయాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా వరదల్లో మునిగిపోవడంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద బాధితుల కోసం సహాయక శిబిరాలను ఏర్పాటు చేశారు.

థాయ్‌లాండ్‌లో భారీ వర్షాలు..

Also Read..

AP Weather Report: రాగల 3 రోజుల్లో ఏపీలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు.. వాతావరణ వివరాలు

IND W vs AUS W: 15 సంవత్సరాల తర్వాత టెస్ట్‌ పోరులో భారత్-ఆస్ట్రేలియా.. పింక్ బాల్ డే-నైట్‌ వార్‌కు సై అంటే సై..