Imran Khan Arrest: ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుపై పాకిస్థాన్‌లో దుమ్ముదుమారం.. కొన్నిగంటలే ఊరటనిచ్చిన హైకోర్టు..

పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు లాహోర్‌ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. రేపు ఉదయం 10 గంటల వరకు ఇమ్రాన్‌ను అరెస్ట్‌ చేయరాదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Imran Khan Arrest: ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుపై పాకిస్థాన్‌లో దుమ్ముదుమారం.. కొన్నిగంటలే ఊరటనిచ్చిన హైకోర్టు..
Imran Khan

Updated on: Mar 15, 2023 | 9:43 PM

పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుపై ఆ దేశంలో గత కొద్దిరోజులుగా ప్రకంపనలు చెలరేగుతున్నాయి. ఇమ్రాన్‌ ఖాన్‌ను రేపు ఉదయం 10 వరకు అరెస్టు చేయొద్దంటూ లాహోర్‌ హైకోర్టు ఆదేశించడంతో మరికొద్ది గంటలు ఇమ్రాన్‌కి ఊపిరిపీల్చుకునే అవకాశం దొరికింది. గత కొద్దిరోజులుగా ఇమ్రాన్‌ అరెస్టులకి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఆయన మద్దతుదారుల ఆందోళలతో ఈ రోజు సైతం కొనసాగాయి. ఆందోళనకారులు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. దీంతో పోలీసులు ఇమ్రాన్‌ మద్దతుదారులపై భాష్పవాయువును, వాటర్‌ కెనాన్లను ప్రయోగించడంతో పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపించింది.

గత కొద్దిరోజులుగా పాకిస్తాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అరెస్టుపై ఆ దేశంలో ప్రకంపనలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే అవినీతి సహా ఇమ్రాన్‌ఖాన్‌పై పలు అరెస్ట్‌ వారెంట్లు జారీ అయ్యాయి. తోషాఖానా కేసులో, న్యాయమూర్తిని బెదిరించిన కేసులో ఇమ్రాన్‌పై ఇప్పటికే నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీఅయింది. దీంతో ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్ట్‌కి పోలీసులు తీవ్రంగా యత్నిస్తుంటే ఇమ్రాన్‌ మద్దతుదారులు పోలీసులను ప్రతిఘటిస్తున్నారు. ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్ట్‌ను అడ్డుకోవడానికి ఆయన అభిమానులు భారీగా తరలివచ్చారు.

కొద్దిరోజులుగా ఇమ్రాన్‌ఖాన్‌ మద్దతుదారులకూ, పోలీసులకూ మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఇమ్రాన్‌ ఇంటిదగ్గర వందలాది మందిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లురువ్వడంతో పరిస్థితి మరింత చేయిదాటిపోయింది. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు భాష్పవాయువును ప్రయోగాలు, లాఠీచార్జ్‌లతో…లాహోర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా లాహోర్‌ హైకోర్టు ఆదేశాలతో రేపు 10 గంటల వరకు ఇమ్రాన్‌ అరెస్టు వాయిదాపడింది. ఇక రేపేం జరుగబోతుందన్న దానిపై ఉత్కంఠ రేగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..