అమెరికాలో భారతీయుల పరువు తీసిన తెలుగు యువకుడు.. ‘అండర్ కవర్’ ఆపరేషన్‌లో దొరికిపోయిన కామపిశాచి!

అమెరికాలో గలీజ్‌ పనులు చేసి దేశం పరువు తీశాడు ఓ తెలుగు యువకుడు. చదువుకోవడానికి అమెరికా వెళ్లి, నీచమైన పనులతో దేశం పరువును బజారున పడేశాడు. మైనర్ల పట్ల కామపిశాచిలా ప్రవర్తించి, అగ్రరాజ్యపు పోలీసుల వలకు చిక్కి, ఇప్పుడు జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు

అమెరికాలో భారతీయుల పరువు తీసిన తెలుగు యువకుడు.. ‘అండర్ కవర్’ ఆపరేషన్‌లో దొరికిపోయిన కామపిశాచి!
Arrest

Updated on: Mar 19, 2026 | 5:18 PM

అమెరికాలో గలీజ్‌ పనులు చేసి దేశం పరువు తీశాడు ఓ తెలుగు యువకుడు. చదువుకోవడానికి అమెరికా వెళ్లి, నీచమైన పనులతో దేశం పరువును బజారున పడేశాడు. మైనర్ల పట్ల కామపిశాచిలా ప్రవర్తించి, అగ్రరాజ్యపు పోలీసుల వలకు చిక్కి, ఇప్పుడు జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు. కన్నవారికి కడుపు కోతను, దేశానికి తీరని అవమానాన్ని మిగిల్చిన ఈ నాగరాజు బల్కం ఉదంతం ఇప్పుడు సభ్య సమాజాన్ని ఛీత్కరించుకునేలా చేస్తోంది.

అమెరికాలోని శాంటా ఫే నగరం పోలీసులు వేసిన మాస్టర్ ప్లాన్‌లో ఈ కామపిశాచి చిక్కుకున్నాడు. ఆన్‌లైన్‌లో చిన్నపిల్లల జీవితాలను చిదిమేసే ‘చైల్డ్ ప్రిడేటర్స్’ను ఏరిపారేయడానికి పోలీసులు ఒక ఆపరేషన్ చేపట్టారు. చాటింగ్ యాప్స్‌లో మైనర్ బాలికల పేరుతో నకిలీ ప్రోఫైల్స్ సృష్టించి ఎర వేశారు పోలీసులు. మైనర్ అమ్మాయి అనుకుని ఆ నకిలీ ఖాతాతో వికృతమైన, అత్యంత అసభ్యకరమైన చాటింగ్ చేశాడు నాగరాజు. అవతలి వైపు ఉంది పోలీసులు అని తెలియక, తనలోని కామపిశాచిని బయటపెట్టి అడ్డంగా బుక్కయ్యాడు. నాగరాజు బల్కంతో పాటు మరో ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

నాగరాజుపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విదేశాల్లో ఉంటున్న భారతీయ యువతకు ఇదొక చేదు గుణపాఠం. ఆన్‌లైన్ ప్రపంచంలో హద్దులు దాటితే ఫలితాలు ఎంత భయంకరంగా ఉంటాయో ఈ ఘటనే సాక్ష్యం. చట్టాల పట్ల అవగాహన లేకపోవడం లేదా బాధ్యతారాహిత్యం వల్ల జీవితాలు ఎలా తలకిందులు అవుతాయో ఈ ఉదంతం స్పష్టం చేస్తోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us