
23rd TANA Conference: ఉత్తర అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రం, నారిస్ టౌన్‌లో ప్రతిష్టాత్మక తానా 23వ మహాసభల సమన్వయ కమిటీల సమావేశం జరిగింది. జులై 7, 8, 9వ తేదీలలో పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో అంగరంగ వైభవంగా జరగబోయే మహాసభలను విజయవంతం చేసేందుకు కార్యాచరణ, మహాసభలకు హాజరయ్యే అతిధుల ఏర్పాట్లు, ఇతర అంశాలపై ఆయా కమిటీల సభ్యులు వారి ప్రణాళికలను వివరించారు. ఈ కార్యక్రమంలో డెలావేర్, న్యూ జెర్సీ, పెన్సిల్వేనియా ఇతరాత్ర రాష్ట్రాల నుంచి సుమారు మూడు వందలపైగా మహాసభల కమిటీ సభ్యులు హాజరై వారి కమిటీల పురోగతి నివేదికలను సమర్పించారు. కమిటీల పనితీరు, పురోగతి నివేదికలపై అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, కన్వీనర్ రవి పొట్లూరి హర్షం వ్యక్తం చేసారు. తానా సభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఇదిలాఉంటే.. తానా సంబరాలలో భాగంగా లాస్ ఏంజెల్స్‌లో ధిం-తానా వేడుకలను నిర్వహించారు. సింగింగ్, డ్యాన్స్ తదితర పోటీలను నిర్వహించారు. తెలుగు NRI లు హాజరై కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..