వడ దెబ్బను తరిమి కొట్టే పచ్చి మామిడి,ఉల్లి చట్నీ.. ఇంట్లో ఎలా చేయాలంటే?

Samatha

06 April 2026

సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది వడదెబ్బకు గురి అవుతుంటారు. అయితే అలాంటి వారి కోసమే ఈ అద్భుతమైన వంటకం.

సమ్మర్

అమ్మమ్మలు సమ్మర్ వచ్చిందంటే చాలు ఎండ వేడి, వడదెబ్బను తరిమి కొట్టే పచ్చి మామిడి ఉల్లి చట్నీ ఇంట్లో తయారు చేసేవారు.

మామిడి, ఉల్లి చట్నీ 

దీనిని తినడం వలన శరీరం హైడ్రేట్‌గా ఉండటమే కాకుండా, ఇది అలసట, నీరసం వంటి సమస్యల నుంచి కాపాడుతుంది. కాగా, దీనిని ఎలా పెట్టాలో ఇప్పుడు చూద్దాం.

శరీరం హైడ్రేట్

పచ్చి మామిడి, ఉల్లిపాయ చట్నీకి కావాల్సిన పదార్థాలు.. పచ్చిమామిడికాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సాల్ట్, బెల్లం, జీలకర్ర పొడి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర పొడి, ఆవాలు, పూదీన, కొంచెం ధనియాల పొడి.

కావాల్సిన పదార్థాలు

తయారీ విధానం : పచ్చి మామిడికాయలు తీసుకొని పై తోలు తీసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు ముక్కలు తరిగినవి, మామిడికా ముక్కలు తీసుకోవాలి.

రుబ్బడం

వీటిని రోటీలో వేసి, రుచికి సరిపడ కారం, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి  కచ్చ పచ్చాగా దంచుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం బెల్లం, ఆవాలు వేసి మరోసారి దంచుకోవాలి.

రుచికి సరిపడ ఉప్పు, కారం

తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, పూదీన ఆకులు కూడా వేసి దంచి పక్కన పెట్టుకోవాలి. అంతే టేస్టే టేస్టీ మచ్చి మామిడి, ఉల్లి చట్నీ రెడీ.

చట్నీ రెడీ

ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, ఎండ వేడి , వడదెబ్బ నుంచి కాపాడటమే కాకుండా, ఆరోగ్యానికి చాలా విధాలుగా మేలు చేస్తుందంట.

వడ దెబ్బ