సరి కొత్త ట్రెండ్.. కొబ్బరి నీళ్లతో కాఫీ.. ఇలా చేసి తాగితే అదిరిపోద్దీ!

Samatha

06 April 2026

సోషల్ మీడియా వచ్చిన తర్వాత వింతలకు, వినోదాలకు కొదవే లేకుండా పోయింది. నెట్టింట కొత్త కొత్త ట్రెండ్స్ హల్ చల్ చేస్తున్నాయి.

సోషల్ మీడియా

అయితే కాఫీ తాగడం ఎవరికైనా ఇష్టం ఉంటుంది. చాలా మంది ఎంతో ఇష్టంగా కాఫీ తాగుతుంటారు. అయితే పాలతో,నీటితో కాఫీ చేయడం తెలుసు.

కాఫీ

కానీ ఇప్పుడు నెట్టింట కొబ్బరి నీళ్లతో కాఫీ కొత్తగా ట్రెండ్ అవుతుంది. చాలా మంది ఈ కాఫీ తెగ ఫిదా అవుతున్నారు.

కొబ్బరి నీళ్లతో కాఫీ

పాలు, సాధారణ నీటికి బదులుగా ఈ కాఫీని కొబ్బరి నీళ్లతో తయారు చేస్తారు. ఇలా తయారు చేసిన కాఫీ తాగడం వలన ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయంట.

కొబ్బరి నీరు

కొబ్బరి నీటితో కాఫీ ఎలా తయారు చేస్తారంట. కావాల్సిన పదార్థాలు, ఐస్ క్యూబ్స్, కాఫీ పొడి, కొబ్బరి నీళ్లు. వీటితో కొబ్బరి నీటి కాఫీ తయారు చేస్తారు.

ఐస్ క్యూబ్స్

ముందుగా ఒక గ్లాస్ తీసుకొని అందులో కాఫీ పౌడర్, కొంచెం చక్కెర, కొద్దిగా వేడి నీరు వేసి బాగా కలిపి నురుగు వచ్చిన తర్వాత పక్కన పెట్టాలి.

కాఫీ మిశ్రమం

ఇప్పుడు ఒక గ్లాస్‌లో కొబ్బరి నీళ్లు తీసుకొని, అందులో మీకు నచ్చి నన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న కాఫీ మిశ్రమం తీసుకోవాలి.

ఐస్ క్యూబ్స్

ఇప్పుడు ఈ కాఫీ మిశ్రమం, కొబ్బరినీళ్లు ఐస్ క్యూబ్ లో వేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ కొబ్బరి నీళ్లతో కాఫీ రెడీ. మరి మీరు ట్రై చేయండి.

కొబ్బరి నీళ్ల కాఫీ రెడీ