TANA: ‘తానా’లో రూ.30 కోట్ల స్కామ్‌ ప్రకంపనలు..! కేసు FBI వరకు వెళ్తుందా..?

అడిగినా సాయం చేయడానికి ముందుకు రానివాళ్లుంటారు. అడగకపోయినా తమవంతు సాయం అందించాలని ఉవ్విళ్లూరుతుంటారు మరికొందరు. అలాంటి వారికి ఓ డెస్టినేషన్‌ పాయింట్‌ 'తానా'. ఎక్కడ డొనేట్‌ చేయాలి, ఎవరికి మన సాయం అందాలి అనే ప్రశ్న వచ్చినప్పుడు.. అమెరికాలోని తెలుగు కమ్యూనిటీకి కనిపించే పేరు 'తానా.

TANA: తానాలో రూ.30 కోట్ల స్కామ్‌ ప్రకంపనలు..! కేసు FBI వరకు వెళ్తుందా..?
TANA Scam

Updated on: Nov 27, 2024 | 10:20 PM

తెలుగు నేల ‘పుట్టినిల్లు’.. తెలుగు జాతికి ఉత్తర అమెరికా ‘మెట్టినిల్లు’.. అని అంటుంటారు ప్రవాస తెలుగువారు. ఈ అభిమానం ఎంతలా చొచ్చుకెళ్లిందంటే.. ఇదీ మనదేశమే అని ఓన్‌ చేసుకునేంతలా. ఎంతైనా దేశం కాని దేశమేగా అది. కష్టం వస్తే ఎవరికి చెప్పుకోవాలి? ఏదైనా ఇబ్బందొస్తే చేదోడు వాదోడుగా ఉండేదెవరు? అనుకోని పరిస్థితుల్లో చనిపోతే.. ఆఖరి చూపుకు నోచుకోనంత కష్టం వస్తే.. సాయం చేసేదెవరు? అమెరికాలో తెలుగు సంస్కృతి-సంప్రదాయాలను కాపాడేదెవరు? తెలుగు భాషను పరిరక్షించేవాళ్లెవరు? వీటన్నిటికీ సమాధానం ‘తెలుగు అసోసియేషన్ ఆఫ్‌ నార్త్‌ అమెరికా-తానా’. లక్ష్యం-ఆశయం-ఉద్దేశం గొప్పవే అయినా.. ఘనమైన కీర్తి ఉన్నా.. ఇప్పుడు ‘తానా’ అంటే అర్థం మారుతోంది. ‘తానా ఫౌండేషన్‌’లో 30 కోట్ల రూపాయల స్కామ్‌ ప్రకంపనలు రేపుతోంది. 47 ఏళ్ల ఏనాడు జరగని ఇంతపెద్ద కుంభకోణం ఇప్పుడు వెలుగుచూడడానికి కారణమేంటి? అసలు తానాకు నిధులు ఎలా వస్తాయి? ఎవరిస్తారు తానాకు నిధులు? తానా అకౌంట్ల నుంచి తమ సొంత అకౌంట్‌కి అంతపెద్ద మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవడం అంత ఈజీనా? 30 కోట్ల కుంభకోణం ఒక్కరి వల్ల సాధ్యమయ్యే పనేనా? డిటైల్డ్‌గా తెలుసుకుందాం పదండి. అమెరికాలో తెలుగువారికంటూ కొన్ని సంఘాలున్నాయ్. కాని, బాగా డబ్బున్న సంఘం మాత్రం ‘తానా’నే అనే బ్రాండ్‌ ఉంది. మోస్ట్‌ ప్రెస్టీజియస్ సంఘం కూడా. తానాలో పదవి అంటే తెలుగు సొసైటీలో దక్కే ఓ అత్యున్నత ప్రతిష్ఠ అది. అమెరికాలోని తెలుగువారి మధ్య తమకంటూ ఓ వెయిటేజ్‌ ఇస్తుందా...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి