US Elections 2024: అమెరికా ఎన్నికల వేళ.. గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్..

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతుంది. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తన కంపెనీ ఉద్యోగులకు అమెరికా ఎన్నికల నేపథ్యంలో ఓ మెయిల్‌ పంపించాడు. అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలిచినా.. అన్ని వర్గాల ప్రజలకు విశ్వసనీయ సమాచార కేంద్రంగా గూగుల్ కంపెనీ ఉండాలని ఆయన మెయిల్‌లో పేర్కొన్నాడు.

US Elections 2024: అమెరికా ఎన్నికల వేళ.. గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్..
Sundar Pichai’s Warning To Google Employees Amid 2024 Us Election
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Nov 05, 2024 | 10:24 PM

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తన కంపెనీ ఉద్యోగులకు అమెరికా ఎన్నికల నేపథ్యంలో ఓ మెయిల్‌ పంపించాడు. అమెరికా ఎన్నికల్లో ఎవరు గెలిచినా.. అన్ని వర్గాల ప్రజలకు విశ్వసనీయ సమాచార కేంద్రంగా గూగుల్ కంపెనీ ఉండాలని ఆయన మెయిల్‌లో పేర్కొన్నాడు. ఎన్నికల వేళ రాజకీయ విభేదాలలో చిక్కుకోకుండా ఉండేందు కుసుందర్ పిచాయ్ మెయిల్ పంపించినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తను అధికారంలోకి వస్తే సెర్చ్ ఇంజిన్‌పై విచారణ చేపడుతామని చెప్పిన సంగతి తెలిసింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతుంది. ఒకవేళ కమలా హారిస్ గెలిస్తే అమెరికా చరిత్రలో తొలి మహిళా అధ్యక్షురాలు ఆమె చరిత్ర సృష్టిస్తారు. ఒకవేళ ట్రంప్ గెలిస్తే మూడోసారి ఎన్నికల్లో పోటీ చేసి రెండుసార్లు గెలిచిన తొలి నాయకుడిగా చిరిత్ర సృష్టిస్తారు. మంగళవారం సాయంత్రం నుండి US ఎన్నికలకు ఓటింగ్ ప్రారంభం అయింది. దేశంలోని 50 శాతం మంది ఓటర్లు ఇప్పటికే ముందస్తు ఓటింగ్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హారిస్ గెలిస్తే తొలి మహిళా అధ్యక్షురాలిగా దేశ ఆర్థిక, సామాజిక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే సమయంలో, ట్రంప్‌కు ఈ పదవీకాలం అంత సులభం కాదు, ఎందుకంటే అతను మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత, అతను కొత్త వ్యూహాలతో ముందుకు సాగాలి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి